వరకట్న దురాచారం రాజ్యమేలుతున్న ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పెళ్లిళ్లు చేసిన కుటుంబం అప్పులపాలవుతున్న పరిస్థితి ఉంది. ఉన్నత చదువులు చదివిస్తే కట్నం ఇచ్చుకోలేమని తల్లిదండ్రులు తమ కూతుళ్లను మైనార్టీ తీరకముందే వివాహాలు చేస్తున్నారు. ఆడపిల్లలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 18 ఏళ్లు నిండిన నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతుల కోసం ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని ప్రవేశపెట్టింది.
ఆర్థికంగా వెనకబడిన నిరుపేద ఎస్సీ, ఎస్టీ యువతులకు ‘కల్యాణ లక్ష్మి’ పథకం వరం కానుంది. ఆడపిల్లలకు పెళ్లి భారంగా మారిన ప్రస్తుత తరుణంలో, వారి పెళ్లికి ఆర్థికంగా చేయూతనివ్వాలని ప్రారంభించిన ఈ పథకం నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో ఊరట కలిగించనుంది. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం తహసీల్దార్, ఎంపీడీఓలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన పెళ్లికాని యువతులకు మాత్రమే వర్తిస్తుంది.
రెండు విడతలుగా ఆర్థికసాయం..
కల్యాణలక్ష్మి పథకానికి అర్హులైన వారు స్థానిక తమసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రా లు, బ్యాంక్ ఖాతా బుక్ జతచేయాలి. దరఖాస్తులను తహసీల్దార్, ఎంపీడీఓలు పరి శీలించి అర్హులను ఎంపిక చేస్తారు. పథకానికి ఎంపికైన వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం గా రూ.53వేలను పెళ్లి రోజు సగం, తర్వాత సంగం పెళ్లి కూతురు ఖాతాలో జమ చేస్తారు. ఇందు కోసం జిల్లాకు సుమారు రూ.25 కోట్లు మంజూరయ్యాయి.
నిరుపేద యువతులకు వరం.. ‘కల్యాణ లక్ష్మి’
Published Mon, Oct 20 2014 1:02 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement