జనగామ ఆర్డీఓపై జేసీకి ఫిర్యాదు
Published Fri, Sep 9 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 12:49 PM
హన్మకొండ అర్బన్ : దళితులకు భూమి కొనుగోలు పథకం కింద కొడకండ్ల మండలం పెద్దవంగరలో అనర్హులకు భూములు కేటాయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు వచ్చి జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామసభ తీర్మానం లేకుండా లబ్ధిదారులను ఎంపికచేశారని ఈ విషయంలో జనగామ ఆర్డీఓ పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఆర్డీఓపై మాటల దాడితో విరుచుకుపడ్డారు. దీంతో జేసీ, ఎమ్మెల్యే కలుగజేసుకుని శాంతిం పజేశారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు. గ్రామంలో 33 ఎకరాలు కొనుగోలు చేసి ఎలాంటి తీర్మానం లేకుండా 11 మందికి కేటాయించారన్నారు.
Advertisement
Advertisement