‘వాల్మీకి’లో శ్రీ విష్ణు | Sree Vishnu May Act In Varun Tej Valmiki Movie | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 31 2019 4:43 PM | Last Updated on Thu, Jan 31 2019 5:00 PM

Sree Vishnu May Act In Varun Tej Valmiki Movie - Sakshi

తమిళ సూపర్‌హిట్ మూవీ ‘జిగర్తాండ’.. తెలుగులో ‘వాల్మీకి’గా రాబోతోన్న సంగతి తెలిసిందే. టైటిల్‌తోనే వివాదంలోకి వచ్చిన ఈ మూవీ రిలీజ్‌ అయిన తరువాత ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. తమిళ్‌లో బాబీ సింహా, సిద్దార్థ్‌లు ముఖ్య పాత్రలు పోషించగా.. ఈ రీమేక్‌లో బాబీ సింహా పాత్రను వరుణ్‌ తేజ్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. 

ఈ మధ్యే పూజా కార్యక్రమాలను ప్రారంభించిన చిత్రయూనిట్‌ మిగతా నటీనటులను ఎంపిక చేసే పనుల్లో ఉన్నట్లు సమాచారం. వరుణ్‌ తేజ్‌ చేస్తున్న నెగెటివ్‌ పాత్ర చుట్టూ తిరిగే ఈ కథలో మరో ప్రముఖ పాత్ర కూడా ఉండగా.. ఈ పాత్రకు శ్రీవిష్ణును పరిశీలిస్తున్నట్లు టాక్‌. కథా పరంగా శ్రీవిష్ణు ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాడని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి శ్రీవిష్ణు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతాడో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. దబాంగ్‌ను ‘గబ్బర్‌సింగ్‌’గా రీమేక్‌ చేసి సంచలనం సృష్టించిన హరీష్‌ శంకర్‌ ‘వాల్మీకి’ని తెరకెక్కిస్తున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement