‘వాల్మీకి’లో అడుగుపెట్టిన వరుణ్‌ | Varun Tej Valmiki Movie Shooting Started | Sakshi
Sakshi News home page

‘వాల్మీకి’లో అడుగుపెట్టిన వరుణ్‌

Published Thu, Apr 18 2019 3:05 PM | Last Updated on Thu, Apr 18 2019 3:05 PM

Varun Tej Valmiki Movie Shooting Started - Sakshi

వరుస హిట్‌లతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్న మెగాహీరో వరుణ్‌ తేజ్‌. తాజాగా సంక్రాంతి బరిలో దిగి ‘ఎఫ్‌2’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. మెగా హీరోలందరిలో డిఫరెంట్‌గా స్టోరీలను సెలెక్ట్‌ చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పరుచుకుంటున్నారు వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం ఓ తమిళ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

తమిళంలో హిట్‌ అయిన ‘జిగర్తాండ’ను తెలుగులో వాల్మీకి పేరుతో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో పూర్తి హాస్యభరితంగా ఉండే ఈ చిత్రంలో వరుణ్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటించనున్నాడు. ఈరోజు ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించినట్లు.. వరుణ్‌ ట్వీట్‌ చేశాడు. గబ్బర్‌సింగ్‌లాంటి అదిరిపోయే రీమేక్‌ను తెరకెక్కించిన హరీష్‌ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement