
వరుణ్‌తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభోత్సవం గత నెలలో జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. 14రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో మొదలైనట్లు తెలిసింది. కానీ వరుణ్ తేజ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొనడం లేదు. ఎందుకంటే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో చేయబోతున్న బాక్సర్ పాత్ర కోసం శిక్షణ తీసుకోవడానికి లాస్‌ఏంజిల్స్‌లో వెళ్లారు.
ఇప్పుడు వరుణ్ తేజ్ కాలిఫోర్నియాలోఉన్నట్లు తెలిసింది. ‘‘వాల్మీకి’ చిత్రం ఫస్ట్ డే షూటింగ్ ప్రారంభం అయ్యింది. దర్శకుడు హరీష్ శంకర్‌తో పాటు టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ కొత్త టీమ్‌తో జాయిన్ అవ్వడానికి చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. సూపర్ ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని వరుణ్‌తేజ్ ట్వీట్ చేశారు. తమిళంలో వచ్చిన ‘జిగర్‌తండా’కి ‘వాల్మీకి’ రీమేక్ అని టాక్. ఒరిజినల్‌లో బాబీసింహా నటించిన పాత్రలో వరుణ్‌తేజ్ కనిపిస్తారట. అలాగే సిద్ధార్థ్ నటించిన పాత్ర కోసం ఇప్పటి వరకు నాగశౌర్య, శ్రీ విష్ణు, తమిళ నటుడు అథర్వ పేర్లు తెరపైకి వచ్చాయి. అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment