కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా వాల్మీకుల విషయంలో నెలకొన్న ప్రాంతీయ వ్యత్యాసాలను తొలగించేందుకు కృషి చేస్తామని మంత్రి టీజీ వెంకటేశ్ అన్నారు. విషయంపై ప్రభుత్వ కార్యదర్శులతో చర్చించి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. వాల్మీకి మహర్శి జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక బుధవారపేట సర్కిల్‌లో జరిగిన ఉత్సవ సభకు మంత్రి అధ్యక్షత వహించారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, ఏజేసీ రామస్వామి, జెడ్పీ సీఈఓ ఏ సూర్యప్రకాష్, డీసీసీ అధ్యక్షులు బీవై రామయ్య హాజరయ్యారు. ముందుగా వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి జ్యోతులు వెలిగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఎస్టీ జాబితాలో చేరేందుకు వాల్మీకులు పోరాటం చేస్తున్నారని, అయితే ఇందుకు సంబంధించి రాజ్యాంగపరమైన ఇబ్బందులున్నట్లు తెలిసిందన్నారు. సమస్యలను తొలగించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
జోహరాపురం ప్రాంతంలో వాల్మీకి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలాన్వేషణ పూర్తయిందని చెప్పిన మంత్రి త్వరలోనే భూమి పూజ నిర్వహిస్తామని తెలిపారు. నగరంలో వాల్మీకి విగ్రహం ఏర్పాటుకు సహకరిస్తామన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు మాట్లాడుతూ వాల్మీకులను ప్రత్యేకంగా ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదని, ఇందుకు సంబంధించి ప్రాంతీయ వివక్షను తొలగిస్తే చాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ వాల్మీకి చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కోరారు.
జిల్లాలో అనేక సంవత్సరాలుగా సత్ప్రవర్తనతో జీవిస్తున్న ఎంతో మంది వాల్మీకుల పేర్లు రౌడీషీటర్ల జాబితాలో ఉన్నాయని, ఎక్కడ నేరం జరిగినా ముందుగా వారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూవాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ ఆందోళన వ్యక్తం చేశారు. సత్ప్రవర్తన కలిగిన వాల్మీకుల పేర్లను రౌడీషీటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్పీతో సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సందర్భంగా మహర్శి వాల్మీకి వేషధారణలో వచ్చిన రమణ ప్రత్యేక ఆకర్శణగా నిలిచారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య, జిల్లా బీసీ సంక్షేమాధికారి రవిచంద్ర, బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ, సాంఘీక సంక్షేమశాఖ డీడీ ఎంఎస్ శోభారాణి, డా.భవానీప్రసాద్, డా.టి పుల్లన్న, డా.మోహన్, సీనియర్ పాత్రికేయులు టి మద్దిలేటి, బీసీ హెచ్‌డ బ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రాష్ట్ర బీసీ నాయకులు గడ్డం రామక్రిష్ణ, వాల్మీకి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
వాల్మీకుల అభ్యున్నతికి కృషి
Published Sat, Oct 19 2013 4:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM
Advertisement