
కర్నూలు (అర్బన్): కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శనివారం వాల్మీకి జయంతి రాష్ట్రస్థాయి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. వేడుకల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్‌తో ఇప్పటికే రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, వాలీ్మకి కార్పొరేషన్ చైర్మన్ డా.బి. మధుసూదన్, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య చర్చించారు. వాల్మీకి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ నాగభూషణం కర్నూలుకు చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణ దేవరాయ సర్కిల్‌లో ఉన్న వాల్మీకి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం సునయన ఆడిటోరియంలో నిర్వహించే కార్యక్రమానికి కారి్మక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ రామారావు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాలకు చెందిన వాల్మీకి నేతలు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment