హక్కుల సాధనకు వాల్మీకుల సైకిల్ యాత్ర
Published Mon, Nov 28 2016 12:30 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM
కర్నూలు (అర్బన్): హక్కుల సాధనకు డిసెంబర్ 11, 12, 13వ తేదీల్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్రలను నిర్వహిస్తున్నట్లు భారతీయ వాల్మీకి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను కర్నూలు మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీ ప్రసాద్, వాల్మీకి సేన రాష్ట్ర అధ్యక్షుడు టి మద్దిలేటి నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా వాల్మీకి ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం లేదన్నారు.. వెంటనే ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాల్మీకి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయుడు, కల్లూరు మండల కన్వీనర్ ధనుంజయనాయుడు, నాయకులు శంకర్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement