cycle yatra
-
సీఎం జగన్‌ను కలిసేందుకు 800కి.మీ సైకిల్ తొక్కుతూ వచ్చిన అభిమాని
సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు ఆయన అభిమాని, మహారాష్ట్రకు చెందిన రైతు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. జగన్ ఈయనను ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జగన్‌పై ఉన్న అభిమానంతో మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా నుంచి 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ తాడేపల్లికి వచ్చారు కాక్డే. ఈ నెల 17 న అక్కడి నుంచి బయలుదేరాడు. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. చదవండి: జగనన్న కాలంలో ఏపీ వైద్యారోగ్యానికి స్వర్ణయగం: మంత్రి రజిని -
జగనన్నపై ‘మహా’భిమానం.. ఎర్రటి ఎండను లెక్కచేయకుండా..
సాక్షి, హైదరాబాద్: జననేత మీద అతనికి ఉన్న అభిమానం.. అతని చేత సరిహద్దులు దాటించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం గుండా ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయించింది. ఇండియన్ పాలిటిక్స్‌లో కింగ్ అంటూ మనస్ఫూర్తిగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆరాధిస్తున్నాడతను. అందుకే దాదా అని పిల్చుకుంటూ ఆయన్ని కలుసుకునేందుకు సైకిల్ యాత్ర చేపట్టాడు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి. షోలాపూర్‌కు చెందిన కాకా కాక్డే.. రైతు. సీఎం జగన్ అంటే అతనికి ఎంతో అభిమానం. అందుకే ఆయన్ని ఎలాగైనా కలవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. సైకిల్ యాత్ర చేపట్టారు. తద్వారా మీడియా దృష్టిని ఆకట్టుకున్నాడు. అంతేనా.. ఏపీ సీఎం జగన్ భవిష్యత్తులో దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నాడు కూడా. కాకా కాక్డే షోలాపూర్‌లో సీఎం జగన్ పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ స్థాపించి.. పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ జూన్-జులై మధ్య షోలాపూర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాడట. వీలైతే సీఎం జగన్‌ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని భావిస్తున్నాడతను. ఇదంతా ఏం ఆశించి చేస్తున్నారంటే.. సీఎం జగన్‌ను తాను దేవుడిగా భావిస్తానని, దేవుడి నుంచి ఏం ఆశిస్తామని, కేవలం ఆయన్ని కలిసి రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కినా చాలని అంటున్నాడు కాకా కాక్డే. షోలాపూర్ నుంచి 800 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే.. అతను ఏపీ గుంటూరు తాడేపల్లికి చేరుకోగలడు. ఎనిమిది రోజుల నుంచి పదిరోజుల ప్రయాణం లక్ష్యంగా పెట్టుకుని ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నాడు. -
భళా.. బాలకా.. 15 ఏళ్లకే చెన్నై నుంచి లేహ్‌కు సైకిల్ యాత్ర
సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఆశిష్ చెన్నై నుంచి లద్దాఖ్ రాజధాని లేహ్ వరకు సైకిల్ మీద సాహసయాత్ర చేశాడు. కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆశిష్ మాట్లాడుతూ సైకిల్ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలన్నదే తన కల అని ఆశిష్ పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్ చెప్పాడు. చదవండి: అద్దాలతో మెరిసిపోతున్న ట్విన్ టవర్స్.. నెటిజన్ల విమర్శల ట్విస్ట్ -
ఆకలి చావులు లేని భారత్ కోసం..
మోపిదేవి (అవనిగడ్డ): భారత్‌ను ఆకలి చావులు లేని దేశంగా చూడాలన్నది ఆ యువకుడి కల. దానికోసం తనవంతు ప్రయత్నంగా దేశమంతటా పర్యటించాలని నిర్ణయించుకున్నాడు. వ్యవసాయం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, వ్యవసాయానికి దూరమవుతున్న వారిని తిరిగి సాగు వైపు మళ్లించటమే లక్ష్యంగా దేశవ్యాప్త యాత్ర చేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈడిగ ప్రదీప్‌కుమార్.. అనంతపురానికి చెందిన యువకుడు. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రదీప్ ఫిబ్రవరి 23న ఈ యాత్రను చేపట్టాడు. తొలుత పాదయాత్రగా ప్రారంభించినప్పటికీ, యాత్ర నెల్లూరుకు చేరిన సమయంలో అక్కడి స్థానికులు ఆదరించి అతను వద్దని చెప్పినా సైకిల్ కొనిచ్చారు. అప్పటి నుంచి సైకిల్‌పై యాత్ర కొనసాగిస్తున్నాడు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న అతని తల్లిదండ్రులు తొలుత ప్రదీప్ యాత్రను వ్యతిరేకించినా, ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూశాక ప్రోత్సహించటం మొదలుపెట్టారు. జాతీయ జెండా చేబూని, ఆదరించిన వారి నుంచి భోజనం స్వీకరిస్తూ, భోజనం దొరకని రోజున మంచి నీళ్లే ఆహారంగా చేసుకుని ప్రదీప్ తన సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాడు. వ్యవసాయానికి దూరం అవుతున్న రైతులను గమనించి, అందుకు గల కారణాలను అన్వేషిస్తూ, సాగు పట్ల ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రదీప్ యాత్ర గురువారం కృష్ణా జిల్లాలోని మోపిదేవికి చేరింది. స్థానిక వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకున్న ప్రదీప్‌ను దివిసీమ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు అభినందించారు. -
గుండెనిండా ‘జగనన్న’ అభిమానం: కశ్మీర్ నుంచి యాత్ర
ఆదిలాబాద్ టౌన్: తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్ జగనన్నకు గుండె నిండా అభిమానాన్ని చాటారు. జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలని 2018లో ప్రజాసంకల్ప పాదయాత్రలో ఆయనను కలిశారు. ముఖ్యమంత్రి అయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర చేపడతానని ప్రతిజ్ఞ చేశాడు. జగన్ సీఎం కావడంతో ఇచ్చిన మాట ప్రకారం సైకిల్ యాత్ర చేపట్టాడు. 2020 ఫిబ్రవరిలో శ్రీనగర్ నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించి జమ్ము, పంజాబ్, హర్యాన, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సైకిల్ యాత్ర కొనసాగింది. మార్చి 23వ తేదీన లాక్‌డౌన్‌తో సైకిల్ యాత్ర నిలిపివేసి ఇంటికి చేరుకున్నాడు. చదవండి: బంగారు చేప.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్య్సకారుడు ఆదిలాబాద్ నుంచే.. దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని గురువారం ఆదిలాబాద్ పట్టణం నుంచి మళ్లీ సైకిల్ యాత్రను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. 33 రోజుల్లో 4 వేల కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందని, మరో 20 రోజుల్లో 1,800 కిలోమీటర్ల వరకు యాత్ర చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీటీడీ ఎల్సీ మెంబర్ బెజ్జంకి అనిల్‌కుమార్ ఈ సైకిల్ యాత్రను గురువారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. చదవండి: నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా.. ఉద్యోగికి బాస్ వేధింపులు -
37 ఏళ్లుగా తిరుమలకు సైకిల్ యాత్ర
సాక్షి, యాదమరి: తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శ్రీపాదం అరుళ్‌మళై ఆశ్రమ పీఠాధిపతి శక్తిదాసన్ స్వామి సుమారు 37 ఏళ్లుగా తిరుమలకు సైకిల్‌పై వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నాలుగురోజుల క్రితం కోయంబత్తూరు ఆశ్రమం నుంచి సైకిల్‌పై బయలుదేరిన స్వామి సోమవారం ఉదయం జిల్లాలోని యాదమరికి చేరుకున్నారు. అనంతరం స్థానిక ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 నుంచి సైకిల్‌పై తిరుమల యాత్రకు వస్తున్నానని తెలిపారు. అర్చకులు చంద్రశేఖర్‌శర్మ, సత్యనారాయణశర్మ తీర్థప్రసాదాలు అందించి శక్తిదాసన్స్వామికి వీడ్కోలు పలికారు. (చదవండి: భక్తుడికి పోర్న్ లింక్: ఐదుగురిపై వేటు) -
మొక్కు తీర్చుకునేందుకు...
నల్లగొండ : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేస్తానని 2018లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం కాకినాడ సమీపంలోని మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్ ప్రకటించాడు. అనుకున్న విధంగానే వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నమాట ప్రకారం... రమేశ్ ఫిబ్రవరి 20న కశ్మీర్ నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించాడు. 32 రోజులుగా 3,700 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం లాక్డౌన్ కారణంగా నల్లగొండలో మార్చి 22న సైకిల్‌యాత్ర నిలిపివేసి సైకిల్ని నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంచి హైదరాబాద్ వెళ్లాడు. ఈనెల 14న లాక్డౌన్ ఎత్తివేస్తే యాత్ర తిరిగి ప్రారంభించాలనుకున్నాడు. కానీ, కేంద్రం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడంతో బుధవారం నల్లగొండకు వచ్చి తన సైకిల్ తీసుకొని తన స్వగ్రామం మాధవపట్నం బయల్దేరి వెళ్లాడు. లాక్డౌన్ తర్వాత తిరిగి ప్రారంభిస్తా.. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత నల్లగొండలో ఆగిపోయిన సైకిల్ యాత్రను తిరిగి ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని పడాల రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నా. ఆ దేవుడు కనికరించాడు. మొక్కు తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పదో తరగతి వర కు చదువుకున్న నేను వృత్తిరీత్యా పేయింటెంగ్ చేస్తుంటాను. కువైట్ వెళ్లడంతో మొక్కు ఆలస్యమైందన్నారు. శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్ పోలీసులు నా సైకిల్‌యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఎన్‌హెచ్–44 రోడ్డు మార్గం గుండా సైకిల్‌యాత్ర చేస్తు న్నా. పెద్దాపురం నియోజకవర్గ నాయకులు దాలూరి దొరబాబు, మేడిశెట్టి వీరభద్రం నా సైకిల్ యాత్రకు సహకరిస్తున్నారు. నల్లగొండలో ఆగిపోయిన సైకిల్‌యాత్రను తిరిగి లాక్డౌన్ తర్వాత ప్రారంభిస్తాను. రమేశ్‌ను కలిసిన వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం తన స్వగ్రామానికి బయలుదేరిన పడాల రమేశ్‌ను వైఎస్సార్సీపీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి యాదయ్య, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ ఫయ్యాజ్ అహ్మద్, యూత్ ప్రెసిడెంట్ హజారుద్దీన్, ముంతాజ్, చంద్రశేఖర్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
మంచి నాయకుల కోసం ఓ డాక్టర్ సైకిల్ సవారీ..!
సాక్షి, సత్తెనపల్లి: రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నిస్వార్థమైన సేవలు అందించే పాలకులను ఎన్నుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ ఇచ్ఛాపురం నుంచి పులివెందుల వరకు సైకిల్ యాత్ర చేయాలని ఓ డాక్టర్ నిర్ణయించుకున్నారు. ఐదేళ్ల క్రితం పాలకులు కల్పించిన భ్రమలతో ప్రజలు ఓట్లు వేస్తే ఐదేళ్ల పాటు హామీలు అమలు చేయకుండా ప్రజలకు చుక్కలు చూపించారన్నారు. ప్రజలను చైతన్య పరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ సవారీ చేసేందుకు గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణానికి చెందిన హోమియోపతి వైద్యుడు డాక్టర్ యేరువ నరసింహరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ సైకిల్ సవారీ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభమై వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల వద్ద ముగియనుంది. 74 నియోజకవర్గాలను కలుపుతూ యాత్ర సాగేలా రూట్‌మ్యాప్ రూపొందించుకున్నారు. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ ప్రాధాన్యతను వివరిస్తూ సైకిల్ యాత్ర చేపట్టనున్నారు. వైఎస్ జగన్ సీఎం కావాలనే యోచనతో ఎన్నికల పట్ల ప్రజల్లో చైతన్యం తీసుకు రాబోతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు జగన్ సమక్షంలో యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. -
మహిళల్లో చైతన్యం కోసం షీ టీం సైకిల్ యాత్ర
-
దళిత శక్తి రాజకీయ శక్తిగా మారాలి
సాక్షి, హైదరాబాద్ : దళిత శక్తి రాజకీయ శక్తిగా మారి బీసీ వర్గాలను కలుపుకుని రాబోయే రోజుల్లో అధికారం చేపట్టాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదల బతుకులు మారాలంటే విద్య, వైద్యం ఉచితంగా అందచేయాలన్నారు. జనం వీటి కోసమే రూ.కోట్లు ఖర్చుపెడుతున్నారన్నారు. ఉద్యోగాలు చేసే వారు కూడా తమ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ వెల్ఫేర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎమ్మార్పీఎస్ వర్కింగ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25న ఖమ్మం జిల్లా నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర ముగింపు బహిరంగ సభ గురువారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఇందులో గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగ ఉప కులాల బతుకులు మారలేదని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ‘‘దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు డబ్బు బ్యాంక్‌లో జమ చేయాలి. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి ఇవ్వనందుకు వాటి కిరాయిలను ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్లో వేయాలి. మాల మాదిగలు కలసి ఉండాలి. ఇరువర్గాల మధ్య నేను వారధిగా ఉంటా. దళితులంతా ఐక్య రాజకీయ శక్తిగా మారాలి’’అని అన్నారు. రాబోయే సర్పంచ్, సార్వత్రిక ఎన్నికల్లో పల్లెల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. అక్షరంతోనే జాతి మనుగడ అణగారిన బతుకులు మారాలని, మాదిగ ఉప కులాలను అక్షర చైతన్యం వైపు నడిపించాలన్న బాధ్యతతో సైకిల్ యాత్ర చేపట్టినట్లు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. అక్షరాలే జాతి మనుగడకు మూలమని, బతుకులు మారాలంటే విద్య వైపు మళ్లాలని అన్నారు. దళిత వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, చదువుల్లో రాణించాలన్నా ప్రత్యేక సోషల్ వెల్ఫేర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో మాదిరే ప్రత్యేక రాష్ట్రంలోనూ దళితుల పరిస్థితి మారలేదని పేర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల పేద విద్యార్థులు చదువుకునే హక్కు కోల్పోతారని, ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపై సమగ్ర సర్వే జరిపించాలని, డప్పుకు, చెప్పుకు రూ.2 వేల పింఛన్ ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే బంగారు తెలంగాణలో భాగస్వాములవుతామని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓటు చైతన్యంతో రాజకీయ శక్తిగా సత్తా చాటుతామని చెప్పారు. పేద వర్గాలకు చదువును దూరం చేసేందుకే ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తోందని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ ఆరోపించారు. త్వరలోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దళితుల రాజ్యాంగ అధికార బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాట్లాడుతూ.. సీఎం గతంలో డప్పుకు, చెప్పుకు రూ.2 వేల పెన్షన్ ఇస్తామని చెప్పినా ఇంత వరకు దాని ఊసే లేదన్నారు. సభలో మోచి సంఘం రాష్ట్ర నాయకులు డా.రాజమౌళిచారి, చింతల మల్లికార్జున్ గౌడ్, బెడగ సంఘం నేతలు చింతల మల్లికార్జున్, సండ్ర వెంకటయ్య, హోళియ, దాసరి నాయకులు వీరేశం, హనుమంతు, సంఘం మహిళ విభాగం జాతీయ అధ్యక్షులు అందె రుక్కమ్మ, రాష్ట్ర అధ్యక్షులు పిడుగు మంజుల, మామిడి రాంచందర్, జి.డి.నర్సింహ, కొల్లూరి వెంకట్, చందు, కొంగరి శంకర్, అశోక్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
హక్కుల సాధనకు వాల్మీకుల సైకిల్ యాత్ర
కర్నూలు (అర్బన్): హక్కుల సాధనకు డిసెంబర్ 11, 12, 13వ తేదీల్లో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సైకిల్ యాత్రలను నిర్వహిస్తున్నట్లు భారతీయ వాల్మీకి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ నాయుడు తెలిపారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో సైకిల్ యాత్రకు సంబంధించిన కరపత్రాలను కర్నూలు మెడికల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీ ప్రసాద్, వాల్మీకి సేన రాష్ట్ర అధ్యక్షుడు టి మద్దిలేటి నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయినా వాల్మీకి ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయడం లేదన్నారు.. వెంటనే ఫెడరేషన్‌కు పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వాల్మీకి సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ నాయుడు, కల్లూరు మండల కన్వీనర్ ధనుంజయనాయుడు, నాయకులు శంకర్, శివ, రాజు తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాకకు చేరిన సైకిల్‌యాత్ర
దుబ్బాక: సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ చేపట్టిన సైకల్ యాత్ర సోమవారం దుబ్బాకకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మోటిక్ చార్జీలు రూ. 15 వందలు పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరవింద్, సంతోష్, మధు, రాజు, సాయి, నవీన్, రమేశ్, శ్రీకాంత్, సుమన్, రమేశ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్ యాత్ర బృందానికి ఘనస్వాగతం
సింహాద్రిపురం, న్యూస్‌లైన్ : ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు 111 ప్రదేశముల నుంచి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ శాంతి కోసం భగవంతుడి సందేశాన్ని అందించేందుకు శాంతి దూత యువ సైకిల్ యాత్ర శుక్రవారం ఉదయం మండలంలోకి ప్రవేశించింది. బలపనూరు, అంకాలమ్మగూడూరు మీదుగా సింహాద్రిపురానికి చేరుకుంది. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి గీత, వరలక్ష్మిలు మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని గడిపేందుకు కావాల్సిన ఆత్మస్థైర్య ధైర్యాలను యోగం ద్వారా పెంపొందించి ఆత్మహత్యలను నివారించవచ్చునన్నారు. ఒత్తిడి నుంచి విముక్తి కలిగించి ఆరోగ్యకరమైన సమాజాన్ని రాజయోగం ద్వారా నివారించవచ్చునన్నారు. ఈ యాత్ర కొండాపురం నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, కోడూరు మీదుగా బెంగుళూరుకు చేరుకుంటుందన్నారు. అనంతరం బ్రహ్మకుమారిలు స్థానికులచే ప్రతిజ్ఞ చేయించారు. స్థానిక జేఏసీ నాయకులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. -
వైఎస్ జగన్ విడుదల కోరుతూ సైకిల్ యాత్ర
ద్వారకాతిరుమల న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విడుదల చేయాలని కోరుతూ పాలకొల్లు నుంచి ద్వారకాతిరుమల శ్రీవారి దర్శనానిక సైకిల్ యాత్ర చేశారు ఆయన అభిమానులు. పాలకొల్లు మండల సర్పంచ్ల చాంబర్ మాజీ అధ్యక్షుడు కైలా నరసింహరావు, రుద్రరాజు శ్రీనివాసరాజు, ఉత్తుల శ్రీనివాస్, మామిడిశెట్టి దుర్గారావు, ఉత్తుల శ్రీను తదితరులు పాలకొల్లులో శుక్రవారం ఉదయం సైకిళ్లపై యాత్రగా బయల్దేరి సాయంత్రానికి ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీవారిని, అమ్మవార్లను దర్శిం చుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ జగనన్నను నిర్బంధించి ఏడాది పూర్తయినా కేంద్రం ఆయనపై కక్షసాధింపు చర్యలను మాత్రం మానలేదని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి విడుదలవ్వాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా చేయి స్వామీ అంటూ చినవెంకన్నను వేడుకున్నట్లు వారు తెలిపారు. వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం తరువాత రాష్ట్రం చిన్నాభిన్నమయిందన్నారు. వైఎస్ పాలన మళ్లీ అందించగలిగే సమర్థుడు జగన్మోహన్రెడ్డి ఒక్కరే అని పేర్కొన్నారు. ఆయన బయటకు వచ్చిన రోజున ప్రతిపక్షాల్లో నాయకులనేవారు ఉండరని, ఒక్క జగన్ పార్టీయే మిగులుతుందన్నారు. అందుకే కాంగ్రెస్ పాలకులు భయపడి ఆయనను లోపలే ఉంచేందుకు పన్నాగాలు పన్నుతున్నారని పేర్కొన్నారు. వీరికి పార్టీ మండల కన్వీనర్ బుసనబోయిన సత్యనారాయణ, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోలిన నారాయణరావు, మానుకొండ సుబ్బారావు, మిడతా రాధాకృష్ణ, లక్కాబత్తుల సిద్ధిరాజు, ఇమ్మానియేలు తదితరులు స్వాగతం పలికారు.