నల్లగొండ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర చేస్తానని 2018లో తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం కాకినాడ సమీపంలోని మాధవపట్నం గ్రామానికి చెందిన పడాల రమేశ్ ప్రకటించాడు. అనుకున్న విధంగానే వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నమాట ప్రకారం... రమేశ్ ఫిబ్రవరి 20న కశ్మీర్ నుంచి సైకిల్‌యాత్ర ప్రారంభించాడు. 32 రోజులుగా 3,700 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం లాక్‌డౌన్ కారణంగా నల్లగొండలో మార్చి 22న సైకిల్‌యాత్ర నిలిపివేసి సైకిల్‌ని నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఉంచి హైదరాబాద్ వెళ్లాడు. ఈనెల 14న లాక్‌డౌన్ ఎత్తివేస్తే యాత్ర తిరిగి ప్రారంభించాలనుకున్నాడు. కానీ, కేంద్రం లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించడంతో బుధవారం నల్లగొండకు వచ్చి తన సైకిల్ తీసుకొని తన స్వగ్రామం మాధవపట్నం బయల్దేరి వెళ్లాడు.
లాక్‌డౌన్ తర్వాత తిరిగి ప్రారంభిస్తా..
లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత నల్లగొండలో ఆగిపోయిన సైకిల్ యాత్రను తిరిగి ఇక్కడి నుంచే ప్రారంభిస్తానని పడాల రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. జగన్ అన్న ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నా. ఆ దేవుడు కనికరించాడు. మొక్కు తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పదో తరగతి వర కు చదువుకున్న నేను వృత్తిరీత్యా పేయింటెంగ్ చేస్తుంటాను. కువైట్ వెళ్లడంతో మొక్కు ఆలస్యమైందన్నారు. శ్రీనగర్‌లో సీఆర్‌పీఎఫ్ పోలీసులు నా సైకిల్‌యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ఎన్‌హెచ్–44 రోడ్డు మార్గం గుండా సైకిల్‌యాత్ర చేస్తు న్నా. పెద్దాపురం నియోజకవర్గ నాయకులు దాలూరి దొరబాబు, మేడిశెట్టి వీరభద్రం నా సైకిల్ యాత్రకు సహకరిస్తున్నారు. నల్లగొండలో ఆగిపోయిన సైకిల్‌యాత్రను తిరిగి లాక్‌డౌన్ తర్వాత ప్రారంభిస్తాను.
రమేశ్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నాయకులు
బుధవారం తన స్వగ్రామానికి బయలుదేరిన పడాల రమేశ్‌ను వైఎస్సార్‌సీపీ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి యాదయ్య, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండీ ఫయ్యాజ్ అహ్మద్, యూత్ ప్రెసిడెంట్ హజారుద్దీన్, ముంతాజ్, చంద్రశేఖర్‌రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment