
యాదమరి నుంచి బయలుదేరుతున్న శ్రీ పాదం ఆశ్రమ పీఠాధిపతి శక్తి దాసన్
సాక్షి, యాదమరి: తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శ్రీపాదం అరుళ్‌మళై ఆశ్రమ పీఠాధిపతి శక్తిదాసన్ స్వామి సుమారు 37 ఏళ్లుగా తిరుమలకు సైకిల్‌పై వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నాలుగురోజుల క్రితం కోయంబత్తూరు ఆశ్రమం నుంచి సైకిల్‌పై బయలుదేరిన స్వామి సోమవారం ఉదయం జిల్లాలోని యాదమరికి చేరుకున్నారు. అనంతరం స్థానిక ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 నుంచి సైకిల్‌పై తిరుమల యాత్రకు వస్తున్నానని తెలిపారు. అర్చకులు చంద్రశేఖర్‌శర్మ, సత్యనారాయణశర్మ తీర్థప్రసాదాలు అందించి శక్తిదాసన్‌స్వామికి వీడ్కోలు పలికారు. (చదవండి: భక్తుడికి పోర్న్ లింక్: ఐదుగురిపై వేటు)