tirumala balaji temple
-
తిరుమల లడ్డూపై సీబీఐ సిట్ విచారణ
-
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు: శ్రీనివాసుని వైభోగం చూద్దాం రారండి!
శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 04, శుక్రవారం వైభవంగా ఆరంభమయ్యాయి. ఇవి 12వ తేదీ, శనివారం వరకు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వైశిష్ట్యం ఇలా... బంగారు తిరుచ్చి ఉత్సవం: అక్టోబర్ 4, శుక్రవారం ఉదయం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు.సాయంత్రం ధ్వజారోహణం: సాయంత్రం 5.45కు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రాంరంభమయ్యాయి. 7 – సోమవారం ఉదయం: కల్పవృక్ష వాహనం: నాలుగోరోజు ఉదయం స్వామి ఉభయ దేవేరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి దర్శనమిస్తారు. కల్పవృక్ష వాహన దర్శనం వరాలను అనుగ్రహిస్తుంది.రాత్రి: సర్వభూపాల వాహనం... సర్వభూపాల అంటే విశ్వానికే రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాధిరాజని భావం. దిక్పాలకులందరూ స్వామివారిని హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారనే సందేశాన్ని ఇస్తున్నారు.8 – మంగళవారం ఉదయం మోహినీ అవతారం: ఐదోరోజు ఉదయం మోహినీరూపంలో దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. తనకు భక్తులైనవారు మాయను సులభం గా దాటగలరని స్వామి ప్రకటిస్తున్నాడు.సాయంత్రం గరుడ వాహనం: ఐదో రోజు రాత్రి గరుడవాహనంలో ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూపదర్శనమిస్తారు. గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయి.9 – బుధవారం ఉదయ: హనుమంత వాహనం: ఆరోరోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఇరువురినీ చూస్తే వేదాల తత్త్వం ఒనగూరుతుంది.సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం: ఆరోరోజు సాయంత్రం స్వామి స్వర్ణరథాన్ని అధిరోహించి అనుగ్రహిస్తాడు. స్వర్ణోత్సవ సేవలో కల్యాణకట్ట సేవాపరులు బంగారు గొడుగును అలంకరించడం సంప్రదాయం. రాత్రి 7 గంటలకు గజవాహనం... ఆరోరోజు రాత్రి వేంకటాద్రీశుడు గజవాహనంపై భక్తులకు అభయ మిస్తాడు. భక్తులు శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణాగతి చెందాలని తెలుస్తోంది.10 – గురువారం ఉదయం సూర్యప్రభ వాహనం: ఏడోరోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యప్రభ వాహనంపైన దర్శనం వల్ల ఆరోగ్యం, విద్య, ఐశ్వర్యం, సంతానం సిద్ధిస్తాయి.రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం: ఏడో రోజు రాత్రి స్వామి చంద్రప్రభ వాహనం పై విహరిస్తారు. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది.11 – శుక్రవారం ఉదయం: శ్రీవారి రథోత్సవం: ఎనిమిదో రోజు ఉదయం ఉభయదేవేరులతో కూడిన స్వామి రథోత్సవం జరుగుతుంది.రాత్రి 7 గంటలకు అశ్వవాహనం: ఎనిమిదో రోజు రాత్రి శ్రీమలయప్పస్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూ΄ాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని ప్రబోధిస్తున్నాడు.12 – శనివారం ఉదయం 6 గంటలకు చక్రస్నానం: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుగుతుంది. ముందుగా ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు ΄ాలు, పెరుగు, నెయ్యి, తేనె, చందనంతో అర్చకులు అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో పుష్కరిణిలో స్నానం చేసిన వారు యజ్ఞఫలాన్ని పొందుతారని ప్రతీతి..రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణం: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరిదైన తొమ్మిదో రోజు రాత్రి బంగారు తిరుచ్చి ఉత్సవం తరువాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణ ఘట్టంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.– లక్ష్మీకాంత్ ఆలిదేనా, సాక్షి, తిరుమల -
తిరుమల చేరుకున్న మెగాస్టార్ ఫ్యామిలీ.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరంజీవి మరో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈనెల 22న మెగాస్టార్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి నెలకొంది. ఆయన బర్త్ డే సందర్భంగా మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు సైతం చేపట్టనున్నారు. అంతేకాకుండా బ్లాక్‌బస్టర్ మూవీ దాదాపు 22 ఏళ్ల తర్వాత రీ రిలీజవుతోంది. ఇప్పటికే టికెట్స్ కూడా అమ్ముడైపోయాయి.చిరంజీవి తన జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. మెగాస్టార్‌తో పాటు భార్య సురేఖ, అమ్మ అంజనాదేవి కూడా ఉన్నారు. అక్కడే చిరంజీవి తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ కనిపించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.రేపు చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్న కుటుంబ సభ్యులు💐😍🤗#MEGASTAR #MegastarChiranjeevi #Chiranjeevi #HappyBirthdayMegastar #Tirumala @KChiruTweets @JspBVMNaresh pic.twitter.com/x7xUQXYfAp— uppalapati Ram varma (@uppaalapatiRam) August 21, 2024 -
Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా పుష్పాలంకరణ (ఫొటోలు)
-
శ్రీవారి సేవలో గుంటూరు కారం భామ.. వీడియో వైరల్!
కొత్త ఏడాదిలోనే హిట్ సినిమాతో బోణి కొట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరెకెక్కిన గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న ఈ కన్నడ బ్యూటీకి గుంటూరు కారంతో సక్సెస్ ట్రాక్‌లో వచ్చేసింది. తాజాగా ఈ పెళ్లిసందడి భామ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ..' గతంలో పెళ్లి సందడి సినిమా తర్వాత తిరుమలకు వచ్చా. ఇప్పుడు మళ్లీ నా కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నా కొత్త ప్రాజెక్ట్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. తిరుమలకు రావడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అందుకే వచ్చా' అని చెప్పుకొచ్చింది. #Sreeleela, "#GunturKaaram," Actress visited the esteemed Tirumala Tirupati Venkateswara Temple. During her pilgrimage, she participated in the VIP break darshan & offered her सेवा to Lord Venkateswara. The warm reception from temple authorities & blessings from pundits. pic.twitter.com/EUHVCxkj8p — Informed Alerts (@InformedAlerts) February 19, 2024 -
Srikanth Family Visits Tirumala: ఫ్యామిలీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించిన హీరో శ్రీకాంత్ (ఫోటోలు)
-
కుటుంబంతో స్వామివారిని దర్శించిన ప్రభుదేవా, పాప పుట్టాక తొలిసారి..
సాక్షి, తిరుపతి: నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం ప్రభుదేవా, ఆయన భార్య హిమాని, తమ పాపతో పాటు తండ్రి సుందరం మాస్టరుతో కలిసి సాధారణ భక్తులు నిలబడే క్యూ లైనులో వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. మొదటి పెళ్లి- విడాకులు కాగా ప్రభుదేవా గతంలో రమాలత్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు జన్మించగా అందులో ఓ అబ్బాయి చిన్నవయసులోనే మరణించాడు. తర్వాత హీరోయిన్ నయనతారతో ప్రభుదేవా సన్నిహితంగా మెదలడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి చిలికి చిలికి గాలివానలా మారడంతో వీరిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు. తర్వాత ప్రభుదేవా 2020లో ఫిజియోథెరపిస్ట్ హిమానీ సింగ్‌ను పెళ్లాడాడు. గత నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ వార్తలు వచ్చాయి. 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రైన ప్రభుదేవా దీనిపై ప్రభుదేవా సైతం స్పందిస్తూ 50 ఏళ్ల వయసులో మరోసారి తండ్రయ్యానని, ఇప్పుడే జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. కొంతకాలంపాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో గడపాలని భావిస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. అయితే తన కూతురి ఫోటోను మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడా చూపించలేదు. తాజాగా అతడు భార్యాపిల్లలతో కలిసి తిరుమలలో కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ప్రభుదేవాతో సెల్ఫీలు దిగేందుకు జనం ఎగబడ్డారు. చదవండి: శివజ్యోతిని అక్కా అంటూనే ఇలాంటి కామెంట్లా? -
పంచెకట్టులో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బుధవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ దేవాలయానికి వెళ్లాడు. ఆలయ అధికారులు ప్రభాస్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవలో పాల్గొన్న హీరో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాడు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రభాస్‌ను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ ప్రభాస్ తిరుమలలోనే బస చేసి, ఆ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కానున్నాడు. తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ప్రభాస్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. చదవండి: ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇవే సీఎంగా పని చేసి తినడానికి తిండి లేని కటిక దరిద్రంలో కన్నుమూసిన ప్రకాశం పంతులు -
పెళ్లి అనంతరం శ్రీవారిని దర్శించుకున్న మనోజ్-మౌనికలు.. ఫొటోలు
-
మా ప్రేమ గెలిచింది, నాన్న ఆశీస్సులు ఉన్నంతవరకు.. : మనోజ్
నూతన దంపతులు మంచు మనోజ్, భూమా మౌనిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు లక్ష్మీ దంపతులు కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదు. నేడు మా ప్రేమ గెలిచింది. మా నాన్నగారి ఆశీస్సులు., అక్క సపోర్ట్, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. వరుసగా షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉంది. మౌనిక కోరుకుంటే తనకి నా సపోర్ట్ ఉంటుంది. మున్ముందు ఇద్దరం కలసి మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, అలా నా జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చింది. గత నాలుగేళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మళ్లీ తిరిగి ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఒకరికి ఒకరు తోడు ఉండాలని భగవంతుడిని కోరుకున్నాం. అందుకే శివుని ఆజ్ఞతోనే అన్ని జరిగాయని అనుకుంటున్నాను. బాబు, నేను, మౌనిక.. నూతన జీవితంలోకి అడుగుపెట్టాం. కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు..అది ఇదేనేమో' అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు మనోజ్. -
22న శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల
తిరుమల: మార్చి, ఏప్రిల్, మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 22న సాయంత్రం 4 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటిలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలున్నాయి. మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన మిగతా ఆర్జిత సేవా టికెట్లకు ఆన్లైన్ లక్కీడిప్ నమోదు ప్రక్రియ 22న ఉదయం 10 గంటల నుంచి 24న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి సేవను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వ దర్శనానికి 10 గంటలు తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. సోమవారం అర్ధరాత్రి వరకు 61,374 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.20 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు ఉన్నవారికి సకాలంలో, దర్శనం టికెట్లు లేనివారికి 10 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారికి 2 గంటల్లో దర్శనమవుతోంది. కాగా, శ్రీవారిని మంగళవారం ఏపీ హోం మంత్రి తానేటి వనిత, ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు సూర్యకుమార్ యాదవ్, ఎంపీలు ప్రిన్సెస్ దియా కుమారి, శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకున్నారు. అలాగే, మంత్రి తానేటి వనిత కుటుంబ సభ్యులతో తిరుచానూరుకు వెళ్లి పద్మావతీ అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. -
తిరుమలలో సర్వదర్శనం ప్రారంభం
తిరుమల/సింహాచలం/శ్రీశైలం టెంపుల్/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్ర గ్రహణం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మూతబడ్డ ప్రధాన ఆలయాలన్నీ గ్రహణం విమోచానంతరం సంప్రోక్షణ, ప్రదోషకాల పూజలు పూర్తయ్యాక తెరుచుకున్నాయి. రాహుకేతువులకు నిలయమైన శ్రీకాళహస్తీవ్వరాలయంలో మాత్రం స్వామిఅమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం రాత్రి 8.20 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఉ.8.40 గంటలకు ఆలయం తలుపులు మూసివేశారు. రాత్రి 7.20 గంటలకు తెరిచారు. ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, రాత్రి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభమైంది. అలాగే, రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు అన్నప్రసాద వితరణ ప్రారంభమైంది. విశాఖ జిల్లా సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో రాత్రి 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి పూజాదికాలు నిర్వహించారు. ఇక్కడ బుధవారం ఉ.6.30 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఇక శ్రీశైల ఆలయంలో రాత్రి 8 గంటల నుంచి అలంకార దర్శనాన్ని మాత్రమే భక్తులకు కల్పించారు. శ్రీకాళహస్తిలో గ్రహణ కాలాభిషేకాలు మరోవైపు.. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తులు పోటెత్తారు. దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతబడినప్పటికీ ఇక్కడి స్వామిఅమ్మవార్లకు గ్రహణ కాలాభిషేకాలు చేశారు. దీంతో దేశం నలుమూలల నుంచి స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. సహస్ర లింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శాంతి అభిషేకాలు జరిపారు. రష్యా భక్తులు కూడా రాహు–కేతు పూజలు చేయించుకుని మురిసిపోయారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్ నిండి క్యూ లైన్ రాంభగీచ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 80,741 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.22 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కల్యాణకట్టల్లో భక్తులకు సత్వర సేవలు బ్రహ్మోత్సవాలకు అందుబాటులో 1,189 మంది క్షురకులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించనున్న భక్తులకు సత్వర సేవలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా ఆలస్యం లేకుండా 1,189 మంది క్షురకులు మూడు షిఫ్టుల్లో భక్తులకు సేవలందించేలా ఏర్పాట్లు చేసింది. వీరిలో 214 మంది మహిళా క్షురకులు ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు నిర్వహించనుండటంతో విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతోంది. తిరుమలలో ప్రధాన కల్యాణకట్టతోపాటు 10 మినీ కల్యాణకట్టలు ఉన్నాయి. ప్రధాన కల్యాణకట్టతోపాటు, పీఏసీ–1, పీఏసీ–2, పీఏసీ–3, శ్రీ వేంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద గల మినీ కల్యాణకట్టలు కూడా 24 గంటలు పని చేస్తున్నాయి. జీఎన్సీ, నందకం విశ్రాంతి గృహం, హెచ్వీసీ, కౌస్తుభం, సప్తగిరి విశ్రాంతి గృహం మినీ కల్యాణకట్టలు తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయి. వీటిలో రెగ్యులర్ క్షురకులు 337 మంది, పీస్ రేటు క్షురకులు మరో 852 మంది 3 షిఫ్టుల్లో పని చేస్తారు. అన్ని కళ్యాణకట్టల్లో యాత్రికులకు ఉచితంగా కంప్యూటరైజ్డ్ టోకెన్ అందజేస్తారు. -
తిరుమల: ఆధ్యాత్మిక పరిమళం..ఆనంద పరవశం ( ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్ కుటుంబం..
Actor Srikanth Visits Tirumala Temple With His Family: సినీ నటుడు, సీనియర్ హీరో శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (జున్ 28) ఉదయం మెట్ల మార్గంలో కొండెక్కి మరీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రీకాంత్‌తోపాటు భార్య ఊహ, కుమారులు రోషన్, రోహన్, కుమార్తె మేధ ఉన్నారు. వీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్తూ అన్ని మెట్లకు పసుపు కుంకుమలతో పూజ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీకాంత్ కుటుంబాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనాంతరం బయటకు వచ్చిన శ్రీకాంత్, రోషన్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎరుపురంగు లంగావోణీలో మేధ, సాంప్రదాయ దుస్తుల్లో శ్రీకాంత్, రోషన్, రోహన్ ఆకర్షించారు. కాగా తెలుగు చిత్రసీమకు మొదట విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన వారిలో శ్రీకాంత్ ఒకరు. 'పీపుల్స్ ఎన్కౌంటర్' సినిమాతో నటుడిగా పరిచయమైన శ్రీకాంత్ వన్ బై టు మూవీతో హీరోగా మారాడు. తర్వాత వచ్చిన 'తాజ్ మహల్' చిత్రంతో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. 1997లో సహనటి ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో నిందితుడు -
తిరుమల వెళ్లే భక్తులకు గమనిక
తిరుమల: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ సోమవారం ఆన్లైన్లో విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీ డిప్ సేవా టికెట్లు 8,070 ఉన్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు లక్కీ డిప్లో కేటాయించనుంది. దీని కోసం భక్తులు జూన్ 27 ఉదయం 10 గంటల నుంచి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టికెట్ల నిర్థారణ చేస్తారు. కేటాయించిన టికెట్ల జాబితాను జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. భక్తులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా తెలియజేస్తారు. టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు దాని ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు. ఇది కూడా చదవండి: డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'తీస్ మార్ ఖాన్' నిర్మాత
యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'తీస్ మార్ ఖాన్'. పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుండగా.. సునీల్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తమ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ నిర్మాత నాగం తిరుపతి రెడ్డి తన మిత్రులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న ఆయన తీస్ మార్ ఖాన్ సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ సినిమాలో స్టూడెంట్, రౌడీ, పోలీస్.. ఇలా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయి కుమార్ నటిస్తుండటం విశేషం. పలు హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు. చదవండి: షూలతో ఆలయంలోకి హీరో? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? -
తిరుమల మాడ వీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన నయన్
నయనతార- విఘ్నేశ్ శివన్‌ల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానంతరం స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు ఈ నూతన దంపతులు నేడు(జూన్ 9న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో నయనతార కొత్త వివాదంలో చిక్కుకుంది. గుడి ప్రాంగణంలో ఆమె చెప్పులు వేసుకుని తిరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. స్వామివారు కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు ఎంతో పవిత్రమైనవి. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇవేం పనులు అంటూ నయన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోషూట్‌కు తిరుమల ఆలయం వేదికనుకుంటున్నారా? అని ఫైర్ అవుతున్నారు. వెంటనే చేసిన తప్పు తెలుసుకుని స్వామివారిని క్షమాపణ కోరండని సూచిస్తున్నారు. #WikkyNayan From #Tirupati #Nayanthara #VigneshShivan #Nayantharawedding #NayantharaMarriage pic.twitter.com/Y4SlK813yf — NAYANTHARA FC KERALA (@NayantharaFCK) June 10, 2022 They were soo interested in conducting the wedding in Tirupathi.. now have visited the temple soon after wedding 🙏 ❤️ Uff! Such a believer 🙌 #Ladysuperstar #Nayanthara #Nayantharawedding pic.twitter.com/zAhNHp5hdz — Theladysuperstarclub (@Nayantharian) June 10, 2022 చదవండి: కిన్నెరసాని సినిమా రివ్యూ హీరోయిన్‌పై అసభ్య కామెంట్స్, పోలీసులకు ఫిర్యాదు -
శ్రీవారిని దర్శించుకున్న హీరో ఆది దంపతులు
యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ దంపతులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా వీరు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ... 'పెళ్లి తర్వాత తొలిసారిగా వచ్చాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చాడు. అనంతరం అభిమానులతో నూతన వధూవరులు సెల్ఫీలు దిగారు. కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు. చదవండి: సీక్రెట్ ఎంగేజ్మెంట్, కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన పూర్ణ విక్రమ్ సినిమా నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్..
Kangana Ranaut Visits Tirumala Temple: బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. తాను నటించిన తాజా చిత్రం ధాకడ్ విడుదల కానున్న సందర్భంగా విజయం సాధించాలని మొక్కుకున్నారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించిన 'ధాకడ్' మూవీలో కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా నటించింది. ఇదివరకు విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే యాక్షన్స్ సీన్లలో కంగనా మెస్మరైజ్ చేసింది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో 'ధాకడ్' తెరకెక్కింది. ఇందులో విలన్ రోల్లో అర్జున్ రాంపాల్ చేయగా మరో కీలక పాత్రలో దివ్యా దత్త నటించింది. మరీ ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. చదవండి: అక్షయ్, అజయ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. మహేశ్ బాబు అన్నదాంట్లో తప్పేముంది? సపోర్ట్‌గా నిలిచిన కంగనా View this post on Instagram A post shared by Kangana Dhaakad (@kanganaranaut) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
3 గంటల్లోనే శ్రీవారి దర్శనం
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని శుక్రవారం అర్ధరాత్రి వరకు 63,265 మంది దర్శించుకోగా, స్వామివారికి 31,217 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.50 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్టు లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనం 3 గంటల్లోనే లభిస్తోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫొటోలు నిషేధం తిరుమలకు విచ్చేసే భక్తులు తమ వాహనాలకు వ్యక్తుల ఫొటోలు, రాజకీయ పార్టీల జెండాలు, చిహ్నాలు, అన్యమతాలకు సంబంధించిన ప్రచార సామగ్రి తిరుమలకు తీసుకెళ్లడాన్ని టీటీడీ కొన్ని దశాబ్దాల క్రితమే నిషేధించింది. టీటీడీ భద్రతా సిబ్బంది అలిపిరి వద్ద అలాంటి వాహనాలను తిరుమలకు అనుమతించరు. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అవగాహనా రాహిత్యంతో వ్యక్తుల ఫొటోలు, అన్యమత చిహ్నాలు, రాజకీయ పార్టీల జెండాలు కలిగి ఉన్న ఎడల వాటిని విజిలెన్స్ సిబ్బంది వాహనదారులకు వివరించి తీసివేస్తున్నారు. కావున వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీవారి వారపు సేవలు తాత్కాలికంగా రద్దు ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో వేసవిలో సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీవారి ఆలయంలో నిర్వహించే వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేసింది. అందులో భాగంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాద పద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శన సేవలను వచ్చే వారం నుంచి తాత్కాలికంగా టీటీడీ రద్దు చేయనుంది. ఈ సేవలు రద్దు చేసిన రోజుల్లో కూడా సామాన్య భక్తులకు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే టీటీడీ శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇకపై శుక్రవారం అభిషేక సేవ మినహా మిగిలిన వారపు సేవలన్నీ జూన్ 30వ తేదీ వరకు రద్దు చేసినట్లు సమాచారం. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ హీరోయిన్
Actress Janhvi Kapoor Visits Tirumala Temple: అతిలోక సుందరి శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటుంది. శ్రీదేవి, బోనీ కపూర్ల కుమార్తెలా కాకుండా మంచి నటనను కనబరుస్తూ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. తాను అరంగ్రేటం చేసిన దఢక్ సినిమాతోనే నటనలో మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది జాన్వీ. ఇలా సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో పేరడీలు, సార్కాస్టిక్ రీల్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. జాన్వీని ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవారి సంఖ్య 14.8 మిలియన్లు. సినిమాలు, సోషల్ మీడియానే కాకుండా పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటుంది జాన్వీ. తిరుమల క్షేత్రాన్ని ఆదివారం ఉదయం దర్శించుకుంది జాన్వీ కపూర్. స్వామి వారి సేవలో పాల్గొన్న ఆమెకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ తిరుపతి దేవస్థానంతో నటి శ్రీదేవికి కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న ప్రతి ఏడాది శ్రీదేవి తిరుమల దర్శనానికి వెళ్లేవారు. తన తల్లిలానే తనకు తిరుమల అంటే ఎంతే ఇష్టమని, స్వామి సన్నిధిలోనే తాను పెళ్లి చేసుకుంటానని జాన్వీ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. ఇదీ చదవండి: బిగ్ బాస్ వైరల్ వీడియోను రిపీట్ చేసిన జాన్వీ కపూర్ -
రేపు తిరుమలకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం తిరుమల వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.40 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. 2 గంటలకు విమానాశ్రయం నుంచి బయలుదేరి 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 3.30 గంటలకు బర్డ్ హాస్పిటల్‌కు చేరుకుంటారు. అక్కడ చిన్నపిల్లల గుండె జబ్బు చికిత్స ఆస్పత్రిని ప్రారంభిస్తారు. తరువాత అలిపిరికి చేరుకుని శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు దాత నిర్మించిన నడక దారి, పై కప్పును, అక్కడే మరో దాత నిర్మించిన గో మందిరాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం నడక మార్గాన శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తరువాత తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారు. 12వ తేదీన ఉదయం 5.30 గంటలకు తిరిగి శ్రీవారి దర్శనం చేసుకుని గొల్ల మండపాన్ని సందర్శిస్తారు. అక్కడ శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ కన్నడ, హిందీ చానళ్లను ప్రారంభిస్తారు. అనంతరం కొత్తగా నిర్మించిన బూందీపోటును ప్రారంభించి అన్నమయ్య భవన్‌కు చేరుకుంటారు. అక్కడ రైతు సాధికార సంస్థ, టీటీడీ మధ్య జరిగే ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పద్మావతి అతిథి గృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని తాడేపల్లికి బయలుదేరుతారు. 11.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
సీఎం జగన్ నాయకత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు
-
శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి శనివారం దర్శించుకున్నారు. అనంతరం నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. కులమత వ్యత్యాసాలు లేకుండా.. పార్టీల విద్వేషాలు లేకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన అన్నారు. పేదవాడి ఆర్థిక పరిస్థితి మెరుగు పడాలని, విద్యావంతులు కావాలన్నదే ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్ని దేవాలయాలు పునరుద్దరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పచ్చ మీడియా కలిసి సీఎం వైఎస్ జగన్‌ను మతాన్ని ఆపాదించడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ, బీజేపీ పనిగట్టుకొని సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం తగదని ఆయన హెచ్చరించారు. పేదలపై ప్రేమ, ఆప్యాయత లేని వ్యక్తి చంద్రబాబు అని.. ఒక్క పేద కుటుంబానికైనా ఇంటి స్థలాన్ని చంద్రబాబు ఇచ్చాడా అని నారాయణ స్వామి ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించింది: లక్ష్మీ పార్వతి తెలుగు బాషా చైతన్య సదస్సులు తిరుపతిలో నిర్వహించామని.. ఈ కార్యక్రమాల్లో సంస్కృత బాషా కవులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారని తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి చెప్పారు. తెలుగు అకాడమీ పనితీరు చూసి తెలంగాణ ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఒక్క ఏడాదిలో తెలుగు అకాడమీ ఎన్నో విజయాలు సాధించిందని ఆమె తెలిపారు. పుస్తకాల ప్రింటింగ్ పూర్తి అయిందిని.. మరో పదిరోజుల్లో పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని వెల్లడించారు. తిరుపతి కేంద్రంగా తెలుగు సంస్కృతి అకాడమీ బాధ్యతలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించారని ఆమె గుర్తు చేసుకున్నారు. లోయర్ క్లాస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు తెలుగు తప్పనిసరి చేశామని స్పష్టం చేశారు. టీడిపీ ప్రభుత్వం వదిలేసిన తెలుగు అకాడమీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తీసుకొచ్చిందని ఆమె పేర్కొన్నారు. టీటీడీ చైర్మన్‌గా మరోసారి వైవీ సుబ్బారెడ్డిని నియమించడం పట్ల లక్ష్మీపార్వతి ఆనందం వ్యక్తం చేశారు. -
శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ
తిరుమల/చంద్రగిరి/రేణిగుంట: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, అనంతరం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం సతీసమేతంగా తిరుమల ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీజేకు పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం సీజే ఎన్వీ రమణ వేంకటేశ్వర భక్తి చానల్‌తో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తానన్నారు. అనంతరం బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సీజే దంపతులు తిరుమల నుంచి తిరుచానూరుకు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వాగతం పలికారు. ‘ఏం భాస్కర్.. బాగున్నావా? బాగా పనిచేస్తున్నావ్.. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తయారీ అభినందనీయం. నువ్వు పంపిణీ చేసిన ఔషధం నాకూ అందిందయ్యా.. నువ్వు ఇలాగే ప్రజా క్షేమం కోసం మంచి కార్యక్రమాలు తలపెట్టాలి’ అంటూ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డిని సీజే అభినందించారు. మరోసారి తిరుపతికి వచ్చినప్పుడు తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడంతో పాటు వేద పాఠశాల, పిరమిడ్ ధ్యాన మందిరాన్ని సందర్శిస్తానని చెవిరెడ్డితో చెప్పారు. ఈ మేరకు మరోసారి పర్యటనలో తుమ్మలగుంట కార్యక్రమాన్ని పొందుపరచాలని జిల్లా జడ్జిని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీజే ఎన్వీ రమణను కలిసిన పలువురు శ్రీవారి దర్శనానికి వచ్చిన సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణను పలువురు కలిశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ వినతిపత్రం ఇచ్చారు. అలాగే శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణదీక్షితులు కలిసి సుప్రీంకోర్టు సీజేగా నియమితులైనందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉండగా సీజే ఎన్వీ రమణ తన స్నేహితుడు, శ్రీవారి ఆలయ ప్రత్యేకాధికారి డాలర్ శేషాద్రిని కలిశారు. ఆ తర్వాత ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలితకుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌కు సుప్రీం చీఫ్ జస్టిస్ సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి శుక్రవారం వచ్చిన ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో రాజ్‌భవన్ అతిథి గృహంలో సీజేఐ బస చేయనున్నారు. -
నెయ్యి కుంభకోణం ఎఫెక్ట్: వేటు పడింది
సాక్షి, ద్వారకా తిరుమల: శ్రీవారి అంబరుఖానా (ప్రసాదాల తయారీ కేంద్రం)లో ఇటీవల జరిగిన నెయ్యి కుంభకోణం ఘటనకు సంబంధించి నలుగురు ఉద్యోగులపై ఆలయ ఈఓ డి.భ్రమరాంబ సోమవారం చర్యలు చేపట్టారు. అలాగే ఆ ఘటనపై విచారణ జరిపే సమయంలో స్టాకులో పలు అవకతవకలను గుర్తించిన ఈఓ మరో నలుగురు ఉద్యోగులకు ఇప్పుడు మెమోలను జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. స్వామి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి 11 వందల కేజీలు మాయమైనట్లు ఈ ఏడాది జూలైలో దేవస్థానం అధికారులు గుర్తించారు. ఆ సమయంలో అంబరుఖానా గుమస్తాగా పనిచేస్తున్న మద్దాల శ్రీనును దానికి బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. అలాగే అతడి నుంచి రూ.5.30 లక్షలను రికవరీ చేశారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ, అప్పటి రీజినల్ జాయింట్ కమిషనర్, ప్రస్తుత శ్రీవారి దేవస్థానం ఈఓ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన భ్రమరాంబ నివేదికను కమిషనర్‌కు అందజేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న మద్దాల శ్రీనుకు రెండు ఇంక్రిమెంట్లు కట్‌చేసి, విధుల్లోకి తీసుకుంటూ ఈఓ భ్రమరాంబ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇదే ఘటనకు సంబంధించి ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, అలాగే మరో గుమస్తాను బాధ్యులను చేస్తూ, వారికి ఒక్కో ఇంక్రిమెంట్‌ను కట్‌చేస్తూ ఆదేశాలిచ్చారు. అవకతవకలపై మరో నలుగురికి.. నెయ్యి కుంభకోణం ఘటనపై విచారణ జరిపిన సమయంలో ఈఓ భ్రమరాంబ అంబరుఖానాలోని స్టాకులో పలు అవకతవకలను గుర్తించినట్లు తెలిసింది. దీనికి ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, ఇద్దరు గుమస్తాలను బాధ్యులను చేస్తూ, ఏడు రోజుల్లో వివరణ కోరుతూ వారికి మెమోలను జారీచేశారు. అలాగే చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన ఏఈఓకు ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ షాపు లీజు విషయంలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైకుంఠరావును నియమించారు. వీటికి సంబంధించి ఆలయ ఈఓ భ్రమరాంబను వివరణ కోరేందుకు యత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. -
37 ఏళ్లుగా తిరుమలకు సైకిల్ యాత్ర
సాక్షి, యాదమరి: తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శ్రీపాదం అరుళ్‌మళై ఆశ్రమ పీఠాధిపతి శక్తిదాసన్ స్వామి సుమారు 37 ఏళ్లుగా తిరుమలకు సైకిల్‌పై వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. నాలుగురోజుల క్రితం కోయంబత్తూరు ఆశ్రమం నుంచి సైకిల్‌పై బయలుదేరిన స్వామి సోమవారం ఉదయం జిల్లాలోని యాదమరికి చేరుకున్నారు. అనంతరం స్థానిక ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1984 నుంచి సైకిల్‌పై తిరుమల యాత్రకు వస్తున్నానని తెలిపారు. అర్చకులు చంద్రశేఖర్‌శర్మ, సత్యనారాయణశర్మ తీర్థప్రసాదాలు అందించి శక్తిదాసన్స్వామికి వీడ్కోలు పలికారు. (చదవండి: భక్తుడికి పోర్న్ లింక్: ఐదుగురిపై వేటు) -
నిబంధనలను అతిక్రమించిన సీఎం రమేష్
సాక్షి, తిరుమల: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో చేతికి స్మార్ట్ వాచ్‌తో లోనికి ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. ఇక శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూకే నుంచి మన దేశానికి వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్ రాగా, వారిలో కొత్త రకం వైరస్ లక్షణాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. బీజేపీ పార్టీకి దేశమంతా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. తిరుపతిలో జనసేన, బీజేపీ కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు. (చదవండి: శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్) కాగా సీఎం రమేష్ చేతికి ఆపిల్ కంపెనీకి చెందిన స్మార్ట్ వాచ్‌తో ఆలయంలోకి ప్రవేశించారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులు ఆలయంలోకి తీసుకువెళ్లరాదు. పైగా దేవాదాయశాఖ చట్టం ప్రకారం ఇది నేరం కూడా! అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆయన స్మార్ట్ వాచ్‌తో వెళ్లడాన్ని పెద్దగా గమనించలేదు. అన్నీ తెలిసి కూడా సీఎం రమేష్ టీటీడీ నిబంధనలను అతిక్రమించడంపై భక్తులు మండిపడుతున్నారు. (చదవండి: సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్) -
కన్నులపండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
గజవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు
సాక్షి, తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరవ రోజు రాత్రి స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్-19 కారణంగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఏకాంతంగా వాహన సేవలను ఆలయ అర్చకులు నిర్వహించారు. గజం అంటే అహాంకారానికి ప్రతీక. ప్రతిమనిషి గజరాజును అదర్శంగా తీసుకొని తమలోని అహాంకారాలను వీడనాడి స్వామిశరణు కొరాలన్నదే గజవాహన సేవలోని అంతర్యం. గజేంద్రమోక్షంలో తనను శరణు కోరిన గజేంద్రుడిని మొసలి బారి నుంచి కాపాడిన్నట్లే, తన పాదాలను ఆశ్రయించిన భక్తులను అన్నివేళల తానే కాపాడుతానని శ్రీనివాసుడు గజంను అధిరోహిస్తారు. రాజుల కాలం నుంచి చతురంగ బలంలో గజం బలం ఒకటి. కర్మబంధం నుంచి విముక్తి పొందేందుకు గోవిందుడే దిక్కన్నట్లు సాగుతుంది గజవాహన సేవ. -
తిరుమల బ్రహ్మొత్సవాలు : శోభాయమానం స్నపన తిరుమంజనం
-
వచ్చే నెలలో తిరుమల బ్రహ్మోత్సవాలు
సాక్షి, తిరుపతి: సెప్టెంబరు మాసంలో తిరుమలలో విశేష పర్వదినాలు ఉన్నాయి. సెప్టెంబర్ 1న అనంత పద్మనాభ వ్రతం, 17న మహాలయ అమావాస్య ఉంది. 18వ తేదీన తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఆ తర్వాతి రోజు అంటే సెప్టెంబరు 19న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 23న శ్రీవారి గరుడసేవ, 24న శ్రీవారి స్వర్ణ రథోత్సవం, 26న రథోత్సవం నిర్వహించనున్నారు. 27న శ్రీవారి చక్రస్నానం, ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఇక సెప్టెంబరు 28న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం జరుగుతుంది. (చదవండి: దర్శనాలకు ఆటంకం ఉండదు: వైవీ సుబ్బారెడ్డి) చదవండి: వైభవంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలు -
శ్రీవారికి కానుకల అభిషేకం
తిరుమల: కలియుగ వైకుంఠ నాథుడి ప్రాశస్త్యం దశదిశలా వ్యాపిస్తుండడం, శ్రీవారి పట్ల భక్తులకు ఉన్న అపారమైన నమ్మకం వెరసి ఏడుకొండల వాడికి కానుకల అభిషేకం జరుగుతోంది. గడిచిన 5 నెలల్లో శ్రీవారికి వస్తున్న కానుకలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. టీటీడీకి వస్తున్న బంగారం, వెండి కానుకలు, హుండీ ఆదాయం అమాంతంగా పెరుగుతోంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. గతంలో స్వామి వారి దర్శనానికి సాధారణ రోజుల్లో 25 వేల మంది, సెలవు రోజుల్లో 50 వేల మంది వరకు వచ్చేవారు. ఇప్పుడు సాధారణ రోజుల్లో 65æ నుంచి 75 వేల మంది వరకు, సెలవు రోజుల్లో లక్ష మంది వరకు భక్తులు వస్తున్నారు. 20 సంవత్సరాల కిందట శ్రీవారికి ఏడాదికి లభించే హుండీ ఆదాయం వంద కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు అది వేల కోట్లకు చేరుకుంది. దాంతో పాటు బంగారం, వెండి కూడా వేల కేజీలు కానుకలుగా భక్తులు సమర్పిస్తున్నారు. 5 నెలల్లో రికార్డు స్థాయిలో.. శ్రీవారికి భక్తులు సమర్పిస్తున్న కానుకలు ఏటికేడూ పెరుగుతూనే ఉండగా.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 5 నెలల్లోనే గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 5 నెలల కాలంలో టీటీడీ నిర్వహిస్తున్న పథకాలకు భక్తులు రూ. 114 కోట్ల విరాళాన్ని సమర్పించగా.. ఈ ఏడాది రూ. 141 కోట్లు అందించారు. గత ఏడాది శ్రీవారి హుండీకి 1,128 కేజీల వెండి కానుకలుగా సమర్పించగా.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,098 కేజీల వెండి హుండీలో చేరింది. అత్యధికంగా మే నెలలో 1,267 కేజీల వెండి శ్రీవారికి అందింది. గతేడాది 5 నెలల్లో 344 కేజీల బంగారాన్ని భక్తులు సమర్పించగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు 525 కేజీల బంగారం హుండీలో చేరింది. అలాగే గత ఏడాది 5 నెలల్లో రూ. 450.54 కోట్ల రూపాయల హుండీ ఆదాయం శ్రీవారికి లభిస్తే, ఈసారి రూ. 497.29 కోట్లు స్వామివారి ఖజానాలో చేరింది. మానవ సేవే మాధవ సేవ మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో టీటీడీ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పేదలకు ఉన్నత విద్య, ఆధునిక వైద్యం అందిస్తోంది. భక్తులు సమర్పించిన విరాళాలు, హుండీ కానుకలను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు వినియోగిస్తాము. భక్తులకు సౌకర్యాల కల్పనకు, భద్రతకు, తిరుమలను శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. – ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ తిరుమల ప్రత్యేకాధికారి -
తిరుమల తరహాలో మరో ఆలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
ముక్కంటీశుడు మురిసేలా.. ఆధ్యాత్మిక ఆనందంతో భక్తులు విహరించేలా దక్షిణ కైలాసంలో మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. శ్రీకాళహస్తిని తిరుమల తరహాలో అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్న మాస్టర్ ప్లాన్ పనులను ముందుకు తీసుకెళ్లేందుకు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సంకల్పించారు. స్వర్ణముఖి నది నుంచి భక్త కన్నప్ప కొండ వరకు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందించారు. సుందరీకరణతో పాటు రోడ్డుకు ఇరువైపులా వాకింగ్ ట్రాక్, స్వర్ణముఖి నదికి ఇరువైపులా ఉద్యానవనాలు ఏర్పాటుచేసేందుకు చర్యలు ముమ్మరం చేశారు. సాక్షి, తిరుపతి: తిరుమల తరహాలో శ్రీకాళహస్తిలో మాస్టర్ ప్లాన్ అమలుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.300 కోట్లు వెచ్చించాలని భావించింది. అందులో భాగంగా ముక్కంటి ఆలయానికి పక్కనే ఉన్న సన్నిధి వీధిలోని 3.90 ఎకరాలను సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ స్థలంలో మొదటి విడతగా 212 నిర్మాణాలను సేకరించి.. వాటిని తొలగించడం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. స్థల సేకరణకు రూ.99 కోట్లు కేటాయించారు. మొదటి విడతలో 186 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించారు. మరో 26 మందికి పరిహారం చెల్లించాల్సి ఉంది. ఇందులో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ స్థలాలకు, నిర్మాణాలకు సరైన ధర చెల్లించకుండా.. నిర్వాసితులకు న్యాయం చేయకుండా స్థలాలు స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మాస్టర్ ప్లాన్‌కు తెలుగు తమ్ముళ్ల అడ్డు శ్రీకాళహస్తీశ్వర ఆలయ బృహత్తర ప్రణాళిక పనులకు గత ఏడాది మార్చిలో శ్రీకారం చుట్టారు. ఆరు మాసాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొందరు స్థానికులు, వ్యాపారులు పరిహారం పెంచకపోతే స్థలాలు ఖాళీ చెయ్యమని తేల్చిచెప్పారు. టీడీపీ నేతలు వారిని బెదిరించి బలవంతంగా ఖాళీ చేయించారు. సామాన్యులను ఖాళీ చేయించారు గానీ టీడీపీ నాయకుల వ్యాపార సముదాయాలు, భవనాలను తొలగించలేదు. వారు తమకు మాత్రం పరిహారం అదనంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థానికులను ఖాళీ చెయ్యించే విషయంలో కీలకంగా వ్యవహరించిన స్థానిక టీడీపీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి మాత్రం సన్నిధివీధిలో భిక్షాల గాలిగోపురం వద్ద తన స్థలాన్ని ఖాళీ చెయ్యకపోగా అందులో ఏకంగా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. టీడీపీ నేతల మోసపూరిత మాటలు నమ్మి ఖాళీచేసిన సామాన్యులు తెలుగు తమ్ముళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణ భరత్ గుప్త శ్రీకాళహస్తిలో మాస్టర్ ప్లాన్‌పై పలుమార్లు సమీక్షించారు. మాస్టర్ ప్లాన్ నిర్వాసితుల సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా శ్రీకాళహస్తి మాస్టర్ ప్లాన్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి శ్రీకాళహస్తి ఆలయం, స్వర్ణముఖి నది సుందరీకరణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం వచ్చే భక్తులకు అవసరమైన గదుల కొరత లేకుండా నిర్మించాలని నిర్ణయించారు. తిరుమల తరహాలో ఉచిత అన్నప్రసాదం అందివ్వనున్నారు. ఆలయం నుంచి అర్థనారీశ్వరాలయం వరకు రహదారి, రోడ్డుకు ఇరువైపుల వాకింగ్ ట్రాక్, ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చెయ్యనున్నారు. శ్రీకాళహస్తికి ప్రత్యేక ఆకర్షణగా భక్తకన్నప్ప తిప్పపై వంద అడుగులతో స్వామి, అమ్మవార్ల విగ్రహాలు ఏర్పాటు చేయదలిచారు. శ్రీకాళహస్తిలో నిర్వహించే కొండు చుట్టుకు ప్రత్యేకత ఉంది. ఈ ఉత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని కొండ చుట్టూ పూలమొక్కలు, విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాళహస్తి పేరు చెబితే గుర్తుకు వచ్చే స్వర్ణముఖి నదిని ప్రక్షాళన చేసే దిశగా ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారు. రెండు కి.మీ పరిధిలోని స్వర్ణముఖి నదికి ఇరువైపులా పూల మొక్కలు, వాకింగ్ ట్రాక్‌లు, భక్తులకు ఘట్టాలు నిర్మించనున్నారు. స్వర్ణముఖి నదిలోని మురికి నీటిని శుభ్రం చేసేందుకు వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయదలిచారు. శుద్ధి చేసిన నీటిని పట్టణ అవసరాలకు, వ్యవసాయానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అయితే మాస్టర్ ప్లాన్ పూర్తయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి పేరొస్తుందని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. ఎవరు అడ్డుపడినా మాస్టర్ ప్లాన్ అమలుచేసి తీరుతామని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. మాస్టర్ ప్లాన్ ముందుకే శ్రీకాళహస్తి ఆలయం అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. గత వారంలో కలెక్టర్, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మాస్టర్ ప్లాన్ సమస్యకు దాదాపు పరిష్కారం దొరికింది. త్వరలోనే పనులు ప్రారంభించి ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీకాళహస్తిని మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం. – రామస్వామి, కార్యనిర్వహణాధికారి శ్రీకాళహస్తీశ్వరాయలం -
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల నిలిపివేత
తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన విధానంలో అమలవుతున్న కేటగిరి దర్శనాలకు టీటీడీ మంగళం పాడింది. గురువారం నుంచి నూతన విధానాన్ని టీటీడీ అమల్లోకి తెచ్చింది. కొద్ది రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలించి, ఏవైనా లోటుపాట్లు ఎదురైతే పునఃసమీక్షించుకుని భక్తులకు సంతృప్తికర దర్శనాన్ని అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. సాక్షి, తిరుమల : వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దుచేసి 2009కి పూర్వం అమల్లో ఉన్న దర్శన విధానాన్ని అమలుచేయడంపై భక్తులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీనివాసుడి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. భక్తుల కోసం టీటీడీ పలు క్యూలు అందుబాటులో ఉంచింది. సర్వదర్శనం క్యూ, నడకదారి భక్తుల కోసం దివ్యదర్శనం క్యూ, రూ.300లు చెల్లించిన వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ, చంటిబిడ్డల తల్లిదండ్రులు కోసం సుపథం మార్గం, వయోవృద్ధులు, వికలాంగులు కోసం మరో క్యూ.. ఇలా అనేక క్యూలను టీటీడీ ఏర్పాటు చేసింది. సిఫార్సు లేఖలపై దర్శనం కోసం ప్రతి నిత్యం ప్రత్యేకంగా సమయాన్ని టీటీడీ కేటాయిస్తోంది. గతంలో సిఫార్సు లేఖలపై సెల్లార్ దర్శనం, అర్చనానంతర దర్శనం టికెట్లను కూడా కేటాయించే టీటీడీ ఇవన్నీ దళారులకు అడ్డాగా మారిపోయాయంటూ 2009లో వాటిని అన్నింటినీ రద్దుచేసింది. సిఫార్సు లేఖలపై కేవలం వీఐపీ బ్రేక్ దర్శనాలను మాత్రమే కేటాయించడం మొదలుపెట్టింది. గతంలో వీఐపీ బ్రేక దర్శనాలు ఉదయం, సాయంత్రం సమయాల్లో ఉండగా సామాన్య భక్తులకు ప్రాధ్యానత ఇవ్వాలంటూ ఉదయం సమయానికి మాత్రమే పరిమితం చేసింది. మూడు కేటగిరీలు వీఐపీ బ్రేక్ దర్శనాలకు గతంలో ఒకే విధానం అమల్లో ఉండేది. రూ.500లు చెల్లించిన భక్తులను కులశేఖర పడి వరకు టీటీడీ అనుమతించేది. 2009లో అప్పటి ఈఓ ఐవైఆర్ కృష్ణారావు ఈ విధానంలో మార్పులు తీసుకొచ్చారు. టాప్ ప్రయారిటీ, ప్రయారిటీ, జనరల్ అంటూ వీఐపీ బ్రేక్ దర్శనాలను మూడు కేటగిరీలుగా విభజించారు. టాప్ ప్రయారిటీ అంటూ ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే టిక్కెట్లను జారీచేసి వారిని కులశేఖరపడి వరకు అనుమతించడమే కాకుండా హారతి, తీర్థం, శఠారి ఇస్తుండేవారు. ప్రయారిటీ టికెట్టు కింద ద్వితీయ శ్రేణిగా పరిగణించి ఈ టికెట్ పొందిన భక్తులను కులశేఖరపడి వరకు అనుమతించి హారతి మాత్రమే ఇచ్చేవారు. జనరల్ కోటాలో ప్రముఖుల సిఫారస్సు చేసిన వారికి టికెట్టును జారీచేసి కులశేఖరపడి వరకు అనుమతించినా హారతి ఇచ్చేవారు కాదు. రానురాను పరిస్థితి మారిపోయింది. సిఫార్సు లేఖలను తీసుకునే భక్తులు బ్రేక్ దర్శనం అడగడం మానేసి టాప్ ప్రయారిటీ దర్శనం ఇప్పిస్తారా, ప్రియారిటీ దర్శనం ఇప్పిస్తారా అంటూ అడగడం మొదలుపెట్టారు. పాలకమండలిపై ఒత్తిడి పెరిగింది. బాపిరాజు చైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ విధానాని రద్దుచేసేశారు. కానీ కొన్ని రోజులకే తిరిగి వాటి స్థానంలో ఎల్ –1, ఎల్–2, ఎల్ –3 దర్శనాలు వచ్చేశాయి. పేరు మారినా దర్శన విధానంలో మాత్రం చిన్నపాటి మార్పులను టీటీడీ చేసింది. ఎల్–1 కోసం ఒత్తిళ్లు ఎల్–1 టికెట్లు పొందిన వారికి లభించే సేవల వల్ల ఆ టికెట్లకు భలే గిరాకీ ఏర్పడింది. బ్రేక్ దర్శనం అడిగేవారంతా ఎల్–1 కోసమే అధికారుల పై ఒత్తిడి తెచ్చేవారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పాలకమండలి నుంచి ఒత్తిడిని తట్టుకోలేక ఇతరులకు కూడా అధికారులు టిక్కెట్లు జారీ చేయడం మొదలు పెట్టారు. దీంతో బ్రేక్ దర్శనానికి అధిక సమయం పట్టడంతో పాటు ఈ విధానం దళారీలకు కాసుల పంట పం డించింది. ఇతరుల ద్వారా టికెట్లను పొంది భారీ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం నూతనంగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి సూచనలతో సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పించడంపై దృష్టి సారించారు. ఈనేపథ్యంలో బ్రేక్ దర్శనాలను రద్దుచేసి 2009కి పూర్వం ఉన్న విధానాన్నే అమలుల్లోకి తెచ్చారు. ఆ విధానం గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. కేటగిరీలుగా ఉన్న దర్శనాలను పూర్తిగా ఎత్తివేసి బ్రేక్ దర్శనం కింద ప్రతి ఒక్కరికి సాధారణ టికెట్లను జారీచేస్తున్నారు. ప్రముఖులకు ఇబ్బంది లేకుండా.. ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు ఇబ్బంది కలగకుండా వారు స్వయంగా వస్తే వారికి ఇవ్వాల్సిన మర్యాదలను ఇస్తూ వారికి హారతి, దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. తీర్థం, శఠారీలను రాములవారి మేడలో కొలువు జరిగే ప్రదేశంలో ఇస్తోంది. ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకు దర్శనం పూర్తవగానే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు కలిగిన ఇతర భక్తులకు కులశేఖర పడిలో ఓచోట హారతి పళ్ళాన్ని పెట్టి అక్కడి నుంచే స్వామివారి దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. -
చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల : ఈ నెల 16న రాత్రి 1.20 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 16న రాత్రి 7 గంటల నుంచి 17న ఉదయం 5గంటల వరకూ శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 17న అర్చకులు ఆలయాన్ని శుద్ది చేసిన తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణ సందర్భంగా 16న అన్నప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
‘సర్వ ఏకాదశి’కి తిరుమల ముస్తాబు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో విశేష ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వీటిని అంగరంగ వైభంగా నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. అందులో భాగంగా వచ్చే నెల ఏడవ తేదీన శ్రీ మరీచి మహర్షి జయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఆ తరువాత జూలై 12న శయన ఏకాదశితో పాటు చాతుర్మాస్య వ్రతారంభాన్ని పురస్కరించుకుని విశిష్ట పూజలు చేపట్టనున్నారు. జూలై 16న గురుపౌర్ణిమ, చంద్రగ్రహణం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహించనున్నారు. మరుసటి రోజు కర్కాటక సంక్రమణంతో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. జూలై 28న సర్వ ఏకాదశి వేడుకకు తిరుమల దేవస్థానం ఇప్పటినుంచే సర్వాంగ సుందరంగా ముస్తాబవనుంది. -
మొక్కులు చెల్లించిన చెవిరెడ్డి
చంద్రగిరి : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మొక్కులు చెల్లించారు. తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన శ్రీవారిమెట్టు మార్గం మీదుగా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన శ్రీవారిమెట్టు వద్ద, ప్రత్యేక పూజల అనంతరం కుటుంబ సభ్యులతో భక్తిప్రపత్తులతో మెట్టుమెట్టుకూ పసుపు, కుంకుమతో పాటు కర్పూరం పెడుతూ తిరుమలకు వెళ్లారు. తలనీలాలు సమర్పించిన అనంతరం శనివారం తెల్లవారుజామున తిరుమలేశుని దర్శించుకున్నారు. ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వైఎస్సార్సీపీ ఆదరించి, అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో దివంగత నేత రాజన్న రాజ్యాన్ని మళ్లీ చవిచూస్తారని ధీమాగా చెప్పారు. రానున్న ఐదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అందించాలని ఆ దేవుడిని ప్రార్థించానని, జగనన్న పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. అంతకముందు వైఎస్సార్సీపీ నాయకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యారాశి చంద్రశేఖర్‌రెడ్డి, మస్తాన్, ఓబుల్ రెడ్డి, దొడ్లకరుణాకర్ రెడ్డి, శ్రీహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సప్త వాహనాలపై సప్తగిరీశుడు
తిరుమల: సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి రథసప్తమి మహోత్సవం వైభవంగా జరిగింది. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమిలో సప్తవాహనాలపై ఊరేగుతూ మలయప్ప దివ్యమంగళ రూపంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 10 గంటల వరకు ఏడు వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయి. సప్తవాహనాలపై సర్వాంతర్యామి వైభోగం మాఘమాసం శుద్ధ సప్తమి రోజు సూర్యజయంతి పర్వదినం పురస్కరించుకుని తిరుమలలో ప్రతిఏటా రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా మంగళవారం వేకువజామున ఆలయంలో సుప్రభాతం, అభిషేకం, ఇతర వైదిక సేవలు శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయం నుంచి మలయప్పను వాహన మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మంగళ ధ్వనులు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం 5.30 గంటలకు సూర్య ప్రభ వాహనం ప్రారంభించి ఉదయం 7.50 గంటలకు పూర్తిచేశారు. తర్వాత వరుసగా చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలపై ఊరేగారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.15 గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం శాస్త్రోకంగా నిర్వహించారు. తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కల్పవృక్ష , సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. కాగా, శ్రీవారి రథ సప్తమి వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగాయని, రెండు లక్షల మందికి పైగా భక్తులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. -
టీటీడీ ఉద్యోగుల సమస్యలపై..
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యులు మీడియాకు వెల్లడించారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికి 6 మంది సభ్యులతో కమిటీ నియమిస్తున్నట్టు తెలిపారు. టీటీడీలోకి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు 3 సంవత్సరాల తరువాత మాతృసంస్థకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే, ఒకే చోట 3 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని బోర్డు తెలిపింది. నవంబర్ 1 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించింది. పాలకమండలి భేటీ-ముఖ్య నిర్ణయాలు.. తిరుమలలోని వివిధ వసతి సముదాయాల ఆధునీకరణ కు 112 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం. టీటీడీలో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగులకు పరకామణి డిప్యుటేషన్ రద్దు చేస్తూ నిర్ణయం. టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సీట్ల పెంపుకు నిర్ణయం. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో 120 కోట్ల రూపాయలతో అలిపిరి వద్ద 2వేల గదుల వసతి సముదాయ నిర్మాణనికి ఆమోదం. అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణ టెండర్లకు ఆమోదం. -
‘శ్రీవారి సేవలు ఆన్లైన్ కాదు.. అంతా క్యాష్ లైనే’
సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి టీటీడీ పాలకమండలిపై విమర్శలు గుప్పించారు. లేని అధికారాన్ని చలాయిస్తున్న పాలకమండలి సభ్యుల తీరువల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ సేవలు పేరుకు మాత్రమే ఉన్నాయనీ, అంతా క్యాష్‌లైన్ వ్యవహారాలేనని ఆరోపించారు. పాలకమండలి సభ్యులకు కోటా విధానం ఉండడంతో ఆర్జిత సేవ టికెట్లు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి సభ్యులకు ప్రోటోకాల్ విధానం రద్దుచేసి.. వారి కుంటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీవేంకటేశ్వరుడి కటాక్షం వల్లనే తన ప్రాణాలు నిలిచాయని చెప్పుకునే చంద్రబాబు తిరుమల కొండపై జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని అన్నారు. కనీసం రిటైర్డ్ జడ్జితోనయినా విచారణ జరిపించాలని అన్నారు. ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై టీటీడీ బోర్డు అనాగరికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శ్రీకృష్ణ దేవరాలయ కాలంలో మాదిరిగా దర్శనం చేసుకుంటున్న భక్తులను నెట్టివేస్తున్నారని వాపోయారు. ఆపదమొక్కులవాడు.. శ్రీవేంకటేశ్వరుడు తమని ఆదుకుంటాడని భక్తులు కొండకు వస్తుంటే.. దేవుడి నగలు, వజ్రాభరణాలు పోయాయనే ప్రచారం ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. సమాచార హక్కు చట్ట పరిధిలోకి శ్రీవారి ఆలయాన్ని తీసుకురావాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. -
తిరుమల పరిణామాలపై స్వామీజీల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై స్వామీజీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులపై ముప్పేట దాడి ఎంత మాత్రం సహేతుకం కాదని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు సమాలోచనలు జరిపిన స్వామిజీలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోతే ధర్మాన్ని రక్షించడం కోసం ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి స్వామీజీలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అత్యంత రహస్యంగా స్వామీజీలు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మీడియా, మీడియా ప్రతినిధులను కూడా దూరంగా ఉంచారు. ఇటీవల తిరుమలలో జరుగుతున్న సంఘటనలకు నిరసనగా జూన్ 9న తిరుపతిలో డిక్లరేషన్ ప్రకటించనున్నారు. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి, పరిపూర్ణనంద స్వామి, కమలానంద భారతి స్వామితో పాటు పలువురు ధర్మాచార్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు వచ్చా
సాక్షి, తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఆశీస్సులు అందుకునేందుకు తిరుమల వచ్చానని, సంతోషంగా ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలిపిరి నుంచి శనివారం కాలినడకన తిరుమల వచ్చిన ఆయన ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఆలయంలోని యోగనృసింహస్వామి సన్నిధి వద్ద తనకు అన్నప్రాసన చేసి, పేరు పెట్టారన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో దైవ సంబంధిత విషయాలు తప్ప వేరేవి మాట్లాడకూడదన్నారు. అంతకుముందు సుమారు 64 మందితో కలసి ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్ మార్గం నుంచి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత కూడా పవన్ తిరుమలలోని హంపి మఠంలోనే బస చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం ఉదయం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీ.ఎస్ ఠాకూర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు న్యాయమూర్తులకు వేదాశీర్వాదాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.