
మెగాస్టార్ చిరంజీవి మరో వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈనెల 22న మెగాస్టార్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి నెలకొంది. ఆయన బర్త్ డే సందర్భంగా మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు సైతం చేపట్టనున్నారు. అంతేకాకుండా బ్లాక్‌బస్టర్ మూవీ దాదాపు 22 ఏళ్ల తర్వాత రీ రిలీజవుతోంది. ఇప్పటికే టికెట్స్ కూడా అమ్ముడైపోయాయి.
చిరంజీవి తన జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బయలుదేరి వెళ్లారు. తన కుటుంబసభ్యులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తున్న వీడియో వైరల్‌గా మారింది. మెగాస్టార్‌తో పాటు భార్య సురేఖ, అమ్మ అంజనాదేవి కూడా ఉన్నారు. అక్కడే చిరంజీవి తన ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తూ కనిపించారు. గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.
రేపు చిరంజీవి గారి జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు చేరుకున్న కుటుంబ సభ్యులు💐😍🤗#MEGASTAR #MegastarChiranjeevi #Chiranjeevi #HappyBirthdayMegastar #Tirumala @KChiruTweets @JspBVMNaresh pic.twitter.com/x7xUQXYfAp
— uppalapati Ram varma (@uppaalapatiRam) August 21, 2024
Comments
Please login to add a commentAdd a comment