శివశంకర వరప్రసాద్ అంటే కొందరు గుర్తు పట్టలేరమో తెలియదు కానీ.. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియాలో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా సినీ ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకున్నారు మెగాస్టార్. ఆగస్టు 22, 1955న ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి తన నట జీవితాన్ని 1970లో ప్రారంభించారు. దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించిన మెగాస్టార్ ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఠాగూర్ సూపర్ హిట్ చిత్రాలతో స్టార్‌డమ్ తెచ్చుకున్నారు.
1978లో పునాదిరాళ్లు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మెగాస్టార్ ఆ తర్వాత విజేత, గూఢచారి -116 లాంటి వంటి చిత్రాలలో విభిన్న పాత్రలలో మెప్పించారు. 1980లలో చిరంజీవి ఖైదీ, జ్వాల, ఛాలెంజ్ వంటి చిత్రాలు ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, స్నేహం కోసం, ఠాగూర్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 22, 2023న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ఆయన కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా చిత్రాలేవో తెలుసుకుందాం.
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇరవైకి పైగా సినిమాలు చేశారు మెగాస్టార్. చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం ఓ రేంజ్‌లో క్రేజ్‌ను తెచ్చి పెట్టింది . అలాగే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్వయంకృషి ఆయన ప్రతిభను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా ఈ సినిమాకు అందుకున్నారు.
1.పసివాడి ప్రాణం
2. స్వయంకృషి
3. జగదేకవీరుడు అతిలోకసుందరి
4.గ్యాంగ్ లీడర్
5.ఖైదీ
6. ముఠామేస్త్రి
7.ఘరానా మొగుడు
8.చూడాలని ఉంది
9.ఠాగూర్
10.ఇంద్ర
ఇవే కాకుండా అప్పట్లో చిరు ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. ఛాలెంజ్, రుద్రవీణ, అడవి దొంగ , విజేత, చంటబ్బాయి, ఆరాధన, స్టేట్ రౌడీ, ఆపద్బాంధవుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, స్నేహం కోసం, సైరా నరసింహా రెడ్డి, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమా లు చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. అయితే ఇటీవల రిలీజైన మెగాస్టార్ 156వ చిత్రం భోళాశంకర్ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment