
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా.. నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రంలోని ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్‌లో ప్రారంభించింది చిత్రబృందం. చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణంపై ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ పనులకు కూడా గురువారమే శ్రీకారం చుట్టారు. భోళా శంకర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీ. ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్‌తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. జూన్‌లో షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment