మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' క్రేజీ అప్‌డేట్‌.. ఫస్ట్‌ సింగిల్‌ ఆరోజే..! | Megastar Chiranjeevi Latest Movie Waltair Veerayya Update | Sakshi
Sakshi News home page

Megastar Waltair Veerayya: మెగాస్టార్ 'వాల్తేరు వీరయ్య' క్రేజీ అప్‌డేట్‌.. ఫస్ట్‌ సింగిల్‌ ఆరోజే..!

Published Sun, Nov 20 2022 4:39 PM | Last Updated on Sun, Nov 20 2022 4:41 PM

Megastar Chiranjeevi Latest Movie Waltair Veerayya Update - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా డైరెక్టర్‌ కేఎస్‌ రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'వాల్తేరు వీరయ్య'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ మూవీ టైటిల్‌ ఖరారు చేసిన చిత్రబృందం తాజాగా మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ విడుదల తేదీని ప్రకటించింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ తన ట్విటర్‌లో వెల్లడించింది. 

(చదవండి: మెగాస్టార్‌కు విద్యార్థుల సర్‌ప్రైజ్.. ఒకేసారి ఆరు వేలమంది కలిసి..!)

వాల్తేరు వీరయ్య సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ఈనెల 23న సాయంత్రం 4.05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయిగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలోని ఓ ఐటం సాంగ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కనిపించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement