టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన జగ్గుభాయ్ ప్రస్తుతం విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. లెజెండ్ సినిమాతో విలన్ పాత్రలో మెప్పించిన జగపతి బాబు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లోనూ మెప్పించారు.
బాలనటుడిగా ఎంట్రీ
1962 ఫిబ్రవరి 12న మచిలీపట్నంలో జన్మించిన జగపతి బాబు తెలుగులో మంచి మనుషులు సినిమాతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత సింహ స్వప్నం అనే సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించారు. అనంతరం శుభాకాంక్షలు, శుభలగ్నం, పెళ్లి పందిరి, మావిడాకులు, పెళ్లి పీటలు లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాకుండా మనోహరం, గాయం వంటి యాక్షన్ సినిమాల్లోనూ మెప్పించారు. తాజాగా ఇవాళ ఆయన 63వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా జగపతి బాబు చేసిన ఫన్నీ ట్వీట్ నెట్టంట తెగ వైరలవుతోంది. చేతిలో వాటర్ బాటిల్, వైన్ పట్టుకుని ఉన్న ఫోటోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
తన ట్విటర్‌లో రాస్తూ.. 'ఎలాగోలా పుట్టేశాను. సిగ్గు లేకుండా అడుగుతున్నా. మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి. రెండోది ఆలోచించకుండా త్వరగా డిసైడ్ చెయ్యండి. ఈ రెండిట్లో ఏది తాగమంటారు?' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. కొత్త ఏడాదిలో గుంటూరు కారం, కాటేరా సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు.
Elagola Putteysanu. siggu lekunda adugutuna, mee andari ashishulu naku kaavali.. Rendodhi, alochinchakunda quick ga decide cheyandi ee renditlo edhi kotamantaru? pic.twitter.com/k8FaHEq4KG
— Jaggu Bhai (@IamJagguBhai) February 12, 2024
Comments
Please login to add a commentAdd a comment