టాలీవుడ్‌లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. విభిన్నమైన పాత్రలతో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ప్రభాస్ సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులనతో టచ్‌లో ఉంటారు. తాజాగా తన మేనేజర్ బర్త్ డే సందర్భంగా ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేశారు.
జగపతిబాబు తన ఇన్‌స్టాలో రాస్తూ..' మా మేనేజర్ మహేష్. మా కొడుకు లాంటి వ్యక్తి పుట్టిన రోజు సందర్బంగా ఎప్పటికీ నా ఫ్యామిలీతో పాటు ఉండే.. మా ఫ్యామిలీ మెంబర్స్‌తో మా ఇంట్లో భోజనాల పండగ…. నాకు ఒక్కడికే రోజంత మజ్జిగా... పాపం నేను.' అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రతి సందర్భాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment