సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. కచ్చితంగా ఆ జాబ్‌ కొట్టేవాడిని: టాలీవుడ్ నటుడు | Jagapathi Babu Tweet On 'If He Was Not In Cinemas, Then He Would Become Cop' | Sakshi
Sakshi News home page

Jagapathi babu: ఇప్పుడున్న వాళ్లలాగే గడగడలాడించేవాడిని: జగపతి బాబు పోస్ట్ వైరల్

Published Sun, Mar 17 2024 6:47 PM | Last Updated on Mon, Mar 18 2024 10:05 AM

Jagapathi babu Tweet On He was Not In Cinemas Then He was The Cop - Sakshi

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు. హీరోగా, విలన్‌గా తనదైన నటనతో మెప్పించారు. లెజెండ్ సినిమాతో విలన్ పాత్రలో మెప్పించిన జగపతి బాబు.. ఆ తర్వాత శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, రంగస్థలం, మహర్షి, అఖండ, సలార్‌ లాంటి సూపర్ హిట్‌  చిత్రాల్లోనూ అలరించారు. ఇటీవల సలార్‌, గుంటూరు కారం చిత్రాల్లోనూ సందడి చేశారు. ప్రస్తుతం అల్లు అర్జున్‌ నటిస్తోన్న పుష్ప-2 చిత్రంలో నటించనున్నారు. 

అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫన్నీ పోస్టులతో అభిమానులను అలరిస్తుంటారు. ఎక్కడికెళ్లినా ఫోటోలు షేర్ చేస్తూ సరదా కామెంట్స్ పెడుతుంటారు. తాజాగా ఇవాళ అలాంటి పోస్ట్ చేశారు. సినిమాల్లోకి వచ్చి ఉండకపోతే.. కచ్చితంగా సూపర్ పోలీస్ అయ్యేవాడిని.. ఇప్పుడుున్న సూపర్ పోలీసుల్లాగే లా అండ్ ఆర్డర్‌ను గడగడలాడించేవాడిని..మీరేమంటారు? అంటూ పోలీసు డ్రెస్‌లో ఉన్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement