
మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ ఇండియాలో అంత క్రేజ్ మరెవరికీ లేదు. అంతలా కళామతల్లి ఒడిలో ఒదిగిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1978లో పునాదిరాళ్లు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇటీవల రిలీజైన భోళాశంకర్ వరకు ఆయన ప్రయాణంతో ఇండస్ట్రీలో చెరగని ముద్రవేశారు.
తన కెరీర్‌లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకే పెద్దదిక్కులా ఉన్నారు. ఆయన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే సినీ కెరీర్‌లో 150కి పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఆగస్టు 22న 1955లో ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో జన్మించారు. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఆంజనేయస్వామి భక్తుడైన మెగాస్టార్‌కు ఇండస్ట్రీలో చిరంజీవిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 22, 2023న ఆయన బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం.
1. చమక్ చమక్ చాం - కొండవీటి దొంగ - విజయంశాంతి
2. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గె రెడ్ చూశా- అల్లుడా మజాకా - రంభ
3. రగులుతోంది మొగలిపొద- ఖైదీ- మాధవి
4. భద్రాచలం కొండ సీతమ్మవారి దండ- గ్యాంగ్ లీడర్- విజయశాంతి
5. బంగారు కోడిపెట్ట వచ్చేనండి- ఘరానా మొగుడు- డిస్కో శాంతి
6. మంచమేసి.. దుప్పటేసి.. మల్లెపూలు చల్లానురా- కొండవీటి రాజా- విజయశాంతి
7. ఇందువదన కుందరదన - ఛాలెంజ్- విజయశాంతి
8. సందె పొద్దులకాడ - అభిలాష- రాధిక శరత్‌కుమార్
9. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - రాక్షసుడు- సుహాసిని
10. సిన్ని సిన్ని కోరికలడగ - స్వయంకృషి- విజయశాంతి
11. నమ్మకు నమ్మకు ఈ రేయిని -రుద్రవీణ- శోభన
12. జై చిరంజీవ జగదేకవీరా.. - జగదేకవీరుడు అతిలోక సుందరి- శ్రీదేవి
13. చుక్కల్లారా చూపుల్లారా - ఆపద్బాంధవుడు- మీనాక్షి
14. దాయి దాయి దామ్మ- కులుకే కుందనాల బొమ్మ- ఇంద్ర- సోనాలి బింద్రే
15. ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్- మృగరాజు- సిమ్రాన్
16. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. - ఠాగూర్- జ్యోతిక, శ్రియాశరణ్
17. వానా వానా వెల్లువాయే.. కొండకొన తుల్లిపోయే- గ్యాంగ్ లీడర్- విజయశాంతి
18. ఆంటీ కుతురా.. అమ్మో అప్సరా.. ముస్తాబు అదిరింది- బావగారు బాగున్నారా?- రంభ
19. బంగారం తెచ్చి.. వెండి వెన్నెల్లో ముంచి- ఇద్దరు మిత్రులు
Comments
Please login to add a commentAdd a comment