all time hit
-
మెగాస్టార్ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్.. లిస్ట్ ఇదిగో!
మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ మెగాస్టార్ ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. సౌత్ ఇండియాలో అంత క్రేజ్ మరెవరికీ లేదు. అంతలా కళామతల్లి ఒడిలో ఒదిగిపోయాడు. దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1978లో పునాదిరాళ్లు చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్.. ఇటీవల రిలీజైన భోళాశంకర్ వరకు ఆయన ప్రయాణంతో ఇండస్ట్రీలో చెరగని ముద్రవేశారు. తన కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన చిరు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకే పెద్దదిక్కులా ఉన్నారు. ఆయన సినిమాల్లో బ్లాక్ బస్టర్స్‌తో పాటు ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే సినీ కెరీర్లో 150కి పైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ఆగస్టు 22న 1955లో ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో జన్మించారు. చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్. ఆంజనేయస్వామి భక్తుడైన మెగాస్టార్‌కు ఇండస్ట్రీలో చిరంజీవిగా ముద్రపడిపోయింది. ఆగస్టు 22, 2023న ఆయన బర్త్ డే సందర్భంగా మెగాస్టార్ ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ గురించి తెలుసుకుందాం. 1. చమక్ చమక్ చాం - కొండవీటి దొంగ - విజయంశాంతి 2. రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గె రెడ్ చూశా- అల్లుడా మజాకా - రంభ 3. రగులుతోంది మొగలిపొద- ఖైదీ- మాధవి 4. భద్రాచలం కొండ సీతమ్మవారి దండ- గ్యాంగ్ లీడర్- విజయశాంతి 5. బంగారు కోడిపెట్ట వచ్చేనండి- ఘరానా మొగుడు- డిస్కో శాంతి 6. మంచమేసి.. దుప్పటేసి.. మల్లెపూలు చల్లానురా- కొండవీటి రాజా- విజయశాంతి 7. ఇందువదన కుందరదన - ఛాలెంజ్- విజయశాంతి 8. సందె పొద్దులకాడ - అభిలాష- రాధిక శరత్‌కుమార్ 9. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు - రాక్షసుడు- సుహాసిని 10. సిన్ని సిన్ని కోరికలడగ - స్వయంకృషి- విజయశాంతి 11. నమ్మకు నమ్మకు ఈ రేయిని -రుద్రవీణ- శోభన 12. జై చిరంజీవ జగదేకవీరా.. - జగదేకవీరుడు అతిలోక సుందరి- శ్రీదేవి 13. చుక్కల్లారా చూపుల్లారా - ఆపద్బాంధవుడు- మీనాక్షి 14. దాయి దాయి దామ్మ- కులుకే కుందనాల బొమ్మ- ఇంద్ర- సోనాలి బింద్రే 15. ఏ ఛాయ్ చటుక్కున తాగరా భాయ్- మృగరాజు- సిమ్రాన్ 16. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. - ఠాగూర్- జ్యోతిక, శ్రియాశరణ్ 17. వానా వానా వెల్లువాయే.. కొండకొన తుల్లిపోయే- గ్యాంగ్ లీడర్- విజయశాంతి 18. ఆంటీ కుతురా.. అమ్మో అప్సరా.. ముస్తాబు అదిరింది- బావగారు బాగున్నారా?- రంభ 19. బంగారం తెచ్చి.. వెండి వెన్నెల్లో ముంచి- ఇద్దరు మిత్రులు -
రుపీ క్రాష్: ముందుంది మహా పతనం!
సాక్షి, ముంబై: అమెరికా డాలరు మారకంలో రోజురోజుకు దిగజారుతున్న దేశీయ కరెన్సీ రూపాయి పతనంపై రాయిటర్స్ పోల్ కీలక విషయాలను వెల్లడించింది. రూపాయి మరింత బలహీనపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సంవత్సరాంతానికి డాలర్‌తో రూపాయి 84.50 స్థాయికి పడిపోతుందన్న అంచనాలు ఆందోళనకు దారి తీసింది. దేశీయ వాణిజ్య లోటు, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న అమెరికా ఫెడ్ వడ్డీరేటు కారణంగా అమెరికా డాలరు మారకంలో రూపాయి ఈ ఏడాది తొమ్మిదేళ్లలో లేనంత కనిష్టానికి పడిపోతుందని రాయిటర్స్ పోల్స్ తేల్చి చెప్పింది. 14 మంది బ్యాంకర్లు, విదేశీ మారకద్రవ్య సలహాదారుల పోల్ అంచనాల ప్రకారం, డిసెంబర్ నాటికి మన రూపాయి 84.50కి మరింత పడిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సంవత్సరం రూపాయి కోలుకోదనే ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు యూఎస్ ఫెడ్ వడ్డింపుతో డాలరు ఇండెక్స్ 18శాతం జంప్ చేసింది. రాబోయే రోజుల్లో రూపాయి మరింత బలహీనత పడి అతి త్వరలోనే 84 స్థాయిని తాకనుందని మెహతా ఈక్విటీస్ వైస్ ప్రెసిడెంట్ కమోడిటీస్ రాహుల్ కలంత్రి అన్నారు. డిసెంబరు నాటికి రూపాయి డాలర్‌తో పోలిస్తే 85 స్థాయికి పతకం కావచ్చు, ఎందుకంటే బాహ్య వాతావరణంలో పెద్ద మార్పులు కనిపించడం లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ అభిప్రాయపడ్డారు. కాగా బుధవారం తొలిసారి 83 స్థాయిని పతనమైన రూపాయి83.21 వద్ద గురువారం మరో ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దాదాపు 12శాతం పడిపోయింది. 2021లో సగటున 15.3 బిలియన్ల డాలర్లతో పోలిస్తే, ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల భారతదేశం సగటు నెలవారీ వాణిజ్య లోటు 23.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది రూపాయి విలువపై ప్రభావాన్ని చూపుతోంది. అటు ఎన్ఎస్డిఎల్ డేటా ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది ఇప్పటివరకు భారతీయ ఈక్విటీల నుండి 23.4 బిలియన్ డాలర్లు, డెట్ మార్కెట్‌నుంచి 1.4 బిలియన్ డాలర్లు పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. -
చమురు పైపైకి.. రూపాయి పాతాళానికి
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఎఫ్ఐఐల అమ్మకాలు, ఎగిసిన గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరల నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి గురువారం 77.81 వద్ద కొత్త కనిష్ట స్థాయిని నమోదు చేసింది. రూపాయి 77.74 వద్ద ప్రారంభమైన రూపాయి ఆపై మరింత పడిపోయింది. బుధవారం 77.68 ముగింపుతో పోలిస్తే 13 పైసలు పతనమైంది. చివరకు 77.78 వద్ద ముగిసింది. స్టాక్మార్కెట్లో విదేశీపెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ డేటా ప్రకారం రూ.2,484.25 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ అంచనాలు, ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి పెరగడంతోపాటు భారతీయ షేర్ మార్కెట్లో ఎఫ్ఐఐలు అమ్మకాల జోరు రూపాయిని మరింత బలహీన పర్చాయని ఫారెక్స్ నిపుణులు తెలిపారు. చైనాలో మేలో ఊహించిన దానికంటే ఎక్కువ ఎగుమతులు 16.9 శాతం (సంవత్సరానికి) జంప్ చేయడం, అక్కడ లాక్డౌన్ పరిమితులను (షాంఘై ఇప్పటికీ కఠినమైన లాక్డౌన్) సడలింపు లాంటి పరిణామాల మధ్య చమురు ధరలు 13 వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని రాయిటర్స్ నివేదించింది. చమురు బ్యారెల్ ధర 123.43 డాలర్ల వద్దకు చేరింది. కాగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే లక్ష్యం: ఆర్బీఐ జూన్ మానిటరీ పాలసీ రివ్యూలో 50 బేసిస్ పాయింట్లు పెంచిన ఆర్బీఐ రెపో రేటును 4.9 శాతంగా ఉంచింది. ఏప్రిల్ 2022 నుండి రెపో రేటును పూర్తిగా 90 బేసిస్ పాయింట్లు పెంచడం రెండు నెలల్లో ఇది రెండవ పెంపు. అలాగే రానున్న సెప్టెంబరు రివ్యూలో కూడా వడ్డీ వడ్డింపు తప్పదనే భావన మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఆహారం,ఇంధన ధరల కారణంగా, ఏప్రిల్ 2022లో ద్రవ్యోల్బణం 7.79 శాతంగా నమోదైంది. అయితే ఇన్ఫ్లేషన్ను 4 శాతానికి తగ్గించడమే తమ లక్ష్యమని గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
ఎల్ఐసీ ఫ్లాప్ షో, మార్కెట్ క్యాప్ ఢమాల్: షాక్‌లో ఇన్వెస్టర్లు
సాక్షి,ముంబై:అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కి మార్కెట్లో వరుసగా ఐదో సెషన్లోనూ అమ్మకాల సెగ తాకింది. ఇన్వెస్టర్ల ఎడ తెగని అమ్మకాలతో సోమవారం ఎస్ఐసీ మరింత దిగజారి ఆల్ టైం కనిష్టానికి చేరింది. ఫలితంగా సంస్థ మార్కెట్ క్యాప్ 5 లక్షల కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. ఇది లిస్టింగ్ నాటికి రూ.6 లక్షల కోట్లకు పై మాటే. ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి. సోమవారం నాటి అమ్మకాలతో ఎల్ఐసీ షేరు 2.86 శాతం క్షీణించి రికార్డు ముగింపు కనిష్టం రూ.777.40 వద్ద స్థిరపడింది. బీఎస్ఈఇండెక్స్లో ఈ స్టాక్ ఆల్-టైమ్ ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ. 775.40ని తాకింది. దీంతో మార్కెట్ విలువ 4.97 లక్షల కోట్లకు చేరింది. అయితే భవిష్యత్తులో మరింత అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోనుందని, యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ ముగియనున్న నేపథ్యంలో రూ. 750 వద్ద మరింత దిగజారే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఎల్ఐసీ షేరు లిస్టింగ్ ప్రైస్ (మే 17న) రూ. 949 నుండి 18.08 శాతం కుప్ప కూలింది. ఎఫ్ఐఐల భాగస్వామ్యం దాదాపు శూన్యం కావడం, లాక్ ఇన్ పీరియడ్ ముగియనుండటంతోపాటు, క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో మరింత దిగజారవచ్చని, పొజిషనల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగాఉండాలని మార్కెట్ నిపుణుడు ఎస్ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ జైన్ సూచించారు. దీంతో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు. అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా మార్చి 2022 త్రైమాసికంలో సంస్థ వార్షిక ప్రాతిపదికన ఏకీకృత నికర లాభం 17 శాతం క్షీణించి 2,410 కోట్లు రూపాయలుగా ఉంది. అయితే నికర ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరింది, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.1.2 లక్షల కోట్లుగా ఉంది. -
భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబై : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 164.91 పాయింట్లు లాభపడి 28, 449.54 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 52.80 పాయింట్లు పెరిగి రికార్డు స్థాయిలో 8530.15 వద్ద ముగిసింది. -
8,500 పాయింట్ల మార్క్ దాటిన నిఫ్టీ
ముంబై : భారత స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి, సెన్సెక్స్-150, నిఫ్టీ 40 పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ తో పోటీ పడుతూ సరికొత్త రికార్డు స్థాయిని అందుకుంది. నిఫ్టీ రికార్డు స్థాయిలో 8,500 పాయింట్ల మార్క్ దాటింది.