మా ప్రేమ గెలిచింది, నాన్న ఆశీస్సులు ఉన్నంతవరకు.. : మనోజ్‌ | Manchu Manoj, Bhuma Mounika Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

Manchu Manoj: జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదు!

Published Mon, Mar 6 2023 3:03 PM | Last Updated on Mon, Mar 6 2023 3:40 PM

Manchu Manoj, Bhuma Mounika Visits Tirumala Temple - Sakshi

నూతన దంపతులు మంచు మనోజ్‌, భూమా మౌనిక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో మనోజ్ దంపతులు, మంచు లక్ష్మీ దంపతులు కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. 'మౌనికతో వివాహం అనంతరం తిరుమలకు రావడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఎందులోనైనా ఓడిపోవచ్చు కానీ ప్రేమలో కాదు. నేడు మా ప్రేమ గెలిచింది. మా నాన్నగారి ఆశీస్సులు., అక్క సపోర్ట్, అత్తమామల ఆశీస్సులు మాపై ఉన్నంత వరకు ఎవరూ ఏమీ చేయలేరు. వరుసగా షూటింగ్స్‌ ప్రారంభం అవుతున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు, ప్రజలకు సేవ చేయాలని మాత్రమే ఉంది. మౌనిక కోరుకుంటే తనకి నా సపోర్ట్ ఉంటుంది.

మున్ముందు ఇద్దరం కలసి మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం.  శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు, అలా నా జీవితంలోకి మౌనిక రెడ్డి వచ్చింది. గత నాలుగేళ్లుగా వేరే లోకంలో ఉన్న నన్ను మళ్లీ తిరిగి ఇక్కడివరకు తీసుకొచ్చింది. ఒకరికి ఒకరు తోడు ఉండాలని భగవంతుడిని కోరుకున్నాం. అందుకే శివుని ఆజ్ఞతోనే అన్ని జరిగాయని అనుకుంటున్నాను. బాబు, నేను, మౌనిక.. నూతన జీవితంలోకి అడుగుపెట్టాం. కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడు..అది ఇదేనేమో' అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరిచాడు మనోజ్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement