
సాక్షి, తిరుమల : ఈ నెల 16న రాత్రి 1.20 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 16న రాత్రి 7 గంటల నుంచి 17న ఉదయం 5గంటల వరకూ శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 17న అర్చకులు ఆలయాన్ని శుద్ది చేసిన తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు. చంద్రగ్రహణ సందర్భంగా 16న అన్నప్రసాద కేంద్రాన్ని కూడా మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.