శ్రీవారి సేవలో గుంటూరు కారం భామ.. వీడియో వైరల్! | Guntur Kaaram Movie Actress Sreeleela Visits Tirumala Temple | Sakshi
Sakshi News home page

Sreeleela: కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల.. వీడియో వైరల్!

Published Mon, Feb 19 2024 3:16 PM | Last Updated on Mon, Feb 19 2024 3:25 PM

Guntur Kaaram Movie Actress Sreeleela Visit TTD Temple Today - Sakshi

కొత్త ఏడాదిలోనే హిట్‌ సినిమాతో బోణి కొట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరెకెక్కిన గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న ఈ కన్నడ బ్యూటీకి గుంటూరు కారంతో సక్సెస్‌ ట్రాక్‌లో వచ్చేసింది. 

తాజాగా ఈ పెళ్లిసందడి భామ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. 

ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ..'  గతంలో పెళ్లి సందడి సినిమా తర్వాత తిరుమలకు వచ్చా. ఇప్పుడు మళ్లీ నా కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నా కొత్త ప్రాజెక్ట్స్‌ త్వరలోనే అనౌ‍న్స్ చేస్తారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. తిరుమలకు రావడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అందుకే వచ్చా' ‍అని చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement