
పాన్ ఇండియా హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. బుధవారం వేకువజామున సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రభాస్ దేవాలయానికి వెళ్లాడు. ఆలయ అధికారులు ప్రభాస్‌కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవలో పాల్గొన్న హీరో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొందాడు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నాడు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు ప్రభాస్‌ను పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ ప్రభాస్ తిరుమలలోనే బస చేసి, ఆ తర్వాత తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కానున్నాడు. తిరుమలలో ప్రభాస్ ఉన్నారని సమాచారం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ప్రభాస్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు.
చదవండి: ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇవే
సీఎంగా పని చేసి తినడానికి తిండి లేని కటిక దరిద్రంలో కన్నుమూసిన ప్రకాశం పంతులు
Comments
Please login to add a commentAdd a comment