
తిరుమల: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మొత్తం 46,470 టికెట్లలో లక్కీ డిప్ సేవా టికెట్లు 8,070 ఉన్నాయి. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్లు లక్కీ డిప్‌లో కేటాయించనుంది.
దీని కోసం భక్తులు జూన్ 27 ఉదయం 10 గంటల నుంచి జూన్ 29 ఉదయం 10 గంటల మధ్య ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్ లక్కీ డిప్ డ్రా తర్వాత టికెట్‌ల నిర్థారణ చేస్తారు. కేటాయించిన టికెట్ల జాబితాను జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల తర్వాత టీటీడీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. భక్తులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా తెలియజేస్తారు.
టికెట్లు పొందిన వారు రెండు రోజుల్లోపు దాని ధర చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు జూన్ 29న సాయంత్రం 4 గంటలకు విడుదలవుతాయి. వీటిని ముందుగా వచ్చిన వారికి ముందు అనే ప్రాధాన్యత క్రమంలో కేటాయిస్తారు.
ఇది కూడా చదవండి: డల్లాస్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం
Comments
Please login to add a commentAdd a comment