
యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ దంపతులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా వీరు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ... 'పెళ్లి తర్వాత తొలిసారిగా వచ్చాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు తీసుకున్నాం. దర్శనం చాలా బాగా జరిగింది' అని చెప్పుకొచ్చాడు. అనంతరం అభిమానులతో నూతన వధూవరులు సెల్ఫీలు దిగారు.
కాగా ఆది, నిక్కీలది ప్రేమ వివాహం. 2015లో వచ్చిన యాగవరైనమ్ నా కక్కా అనే సినిమాలో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో స్నేహితులుగా మారిన ఈ హీరోహీరోయిన్లు మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇరు కుటుంబాలను ఒప్పించిన వీరు మే 18న సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆది ప్రస్తుతం 'వారియర్' మూవీలో విలన్‌గా నటిస్తున్నాడు.
చదవండి: సీక్రెట్ ఎంగేజ్‌మెంట్, కాబోయే భర్త ఫొటోను షేర్ చేసిన పూర్ణ
విక్రమ్ సినిమా నటీనటుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment