
యంగ్ హీరో, నటుడు ఆది పినిశెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ హీరో అయిన ఆది, తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వీ చిత్రం మూవీతో హీరోగా టాలీవుడ్‌కు పరిచయమైన ఆది ప్రస్తుతం తెలుగులో విలన్ పాత్రలు చేస్తున్నాడు. ప్రతి కథానాయకుడిగా ఆది ఇక్కడి ప్రేక్షకుల బాగా మెప్పిస్తున్నాడు. దీంతో ఓ స్టార్ హీరో స్థాయిలో తెలుగు ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మేలో కోలీవుడ్ హీరోయిన్, తన ప్రేయసి నిక్కీ గల్రానీని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. ఈ నేపథ్యంలో ఆది సంబంధించిన ఓ ఆసక్తిర న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: ఇకపై అవేవి ఇంతకు ముందులా ఉండవు, మిస్ యూ తాతయ్య: సితార ఎమోషనల్
త్వరలోనే ఆది తండ్రి కాబోతున్నాడంటూ కోలీవుడ్ మీడియాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన లేదు. కానీ ఆది-నిక్కీలు తల్లిదండ్రులు కాబోతున్నారని కోలీవుడ్‌లో మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే ఈ కోలీవుడ్ జంట స్పందించేవరకు వేచి చూడాల్సిందే. కాగా మే 18, 2022న ఇరు కుటుంబ సమక్షంలో ఆది-నిక్కీల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వీరి వివాహ వేడుకులో టాలీవుడ్ హీరోలు నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సందీప్ కిషన్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆది ది వారియర్‌మూవీలో నటించారు. ప్రస్తుత్తం ఆది తమిళం, తెలుగులో పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment