టీటీడీ ఉద్యోగుల సమస్యలపై.. | TTD Board Appointed A Committee On Contract Workers Issue | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 9 2018 4:12 PM | Last Updated on Tue, Oct 9 2018 6:26 PM

TTD Board Appointed A Committee On Contract Workers Issue - Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సమవేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సభ్యులు మీడియాకు వెల్లడించారు. టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారనికి 6 మంది సభ్యులతో కమిటీ నియమిస్తున్నట్టు తెలిపారు. టీటీడీలోకి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు 3 సంవత్సరాల తరువాత మాతృసంస్థకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే, ఒకే చోట 3 సంవత్సరాల పైబడి పనిచేస్తున్న టీటీడీ ఉద్యోగులకు స్థాన చలనం కల్పించాలని బోర్డు తెలిపింది. నవంబర్ 1 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని అధికారులకు సూచించింది.

పాలకమండలి భేటీ-ముఖ్య నిర్ణయాలు..

  • తిరుమలలోని వివిధ వసతి సముదాయాల ఆధునీకరణ కు 112 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం.
  • టీటీడీలో పనిచేసే పర్మినెంట్ ఉద్యోగులకు పరకామణి డిప్యుటేషన్ రద్దు చేస్తూ నిర్ణయం.
  • టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సీట్ల పెంపుకు నిర్ణయం.
  • భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో 120 కోట్ల రూపాయలతో అలిపిరి వద్ద 2వేల గదుల వసతి సముదాయ నిర్మాణనికి ఆమోదం.
  • అమరావతిలో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయ నిర్మాణ టెండర్లకు ఆమోదం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement