
Actress Janhvi Kapoor Visits Tirumala Temple: అతిలోక సుందరి శ్రీదేవి తనయ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటుంది. శ్రీదేవి, బోనీ కపూర్‌ల కుమార్తెలా కాకుండా మంచి నటనను కనబరుస్తూ ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. తాను అరంగ్రేటం చేసిన దఢక్ సినిమాతోనే నటనలో మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది జాన్వీ. ఇలా సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో పేరడీలు, సార్కాస్టిక్ రీల్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. జాన్వీని ఇన్‌స్టాలో ఫాలో అయ్యేవారి సంఖ‍్య 14.8 మిలియన్లు.
సినిమాలు, సోషల్ మీడియానే కాకుండా పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటుంది జాన్వీ. తిరుమల క్షేత్రాన్ని ఆదివారం ఉదయం దర్శించుకుంది జాన్వీ కపూర్. స్వామి వారి సేవలో పాల్గొన్న ఆమెకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ తిరుపతి దేవస్థానంతో నటి శ్రీదేవికి కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉన్న ప్రతి ఏడాది శ్రీదేవి తిరుమల దర్శనానికి వెళ్లేవారు. తన తల్లిలానే తనకు తిరుమల అంటే ఎంతే ఇష్టమని, స్వామి సన్నిధిలోనే తాను పెళ్లి చేసుకుంటానని జాన్వీ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది.
ఇదీ చదవండి: బిగ్ బాస్ వైరల్ వీడియోను రిపీట్ చేసిన జాన్వీ కపూర్