దివంగత నటి, అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ప్రియుడు శిఖర్ పహారియాతో కలిసి పెళ్లికి ముందే ఇలా స్వామివారిని దర్శించుకుంది. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
సాంప్రదాయ దుస్తుల్లో తిరుమలకు విచ్చేసిన జాన్వీ ఆలయం ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తూ భక్తిశ్రద్దల్లో మునిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. జాన్వీ ప్రియుడు శిఖర్ కూడా పంచె కట్టులో దర్శనమిచ్చారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఎయిర్‌పోర్టులో కూడా ఇద్దరూ జంటగా కనిపించారు. దీనికి తోడు నీతా అంబానీ కల్చరల్ ఈవెంట్‌కు శిఖర్ బోనీ కపూర్‌తో కలిసి వెళ్లాడు. దీంతో వీరి ప్రేమకు పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు బీటౌన్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
#WATCH | Andhra Pradesh: Actor Janhvi Kapoor visited Tirupati Balaji Temple, Tirumala. pic.twitter.com/nYxZq7NA2A
— ANI (@ANI) April 3, 2023
Comments
Please login to add a commentAdd a comment