Nayanthara Walks With Chappals In Tirumala Mada Veedhi - Sakshi
Sakshi News home page

Nayanthara: మాడవీధుల్లో చెప్పులేసుకుని తిరిగిన కొత్త పెళ్లికూతురు

Published Fri, Jun 10 2022 5:43 PM | Last Updated on Fri, Jun 10 2022 6:41 PM

Nayanthara Walks With Chappals In Tirumala Mada Veedhi - Sakshi

గుడి ప్రాంగణంలో ఆమె చెప్పులు వేసుకుని తిరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. స్వామివారు కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధుల్లో ఎంతో పవిత్రమైనవి. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇవేం పనులు అంటూ

నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ల వివాహం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహానంతరం స్వామి వారి ఆశీస్సులు తీసుకునేందుకు ఈ నూతన దంపతులు నేడు(జూన్‌ 9న) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో నయనతార కొత్త వివాదంలో చిక్కుకుంది. గుడి ప్రాంగణంలో ఆమె చెప్పులు వేసుకుని తిరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

స్వామివారు కొలువు తీరిన ప్రాంతంలో ఉన్న మాడవీధులు ఎంతో పవిత్రమైనవి. ఇలాంటి పవిత్రమైన ప్రదేశంలో ఇవేం పనులు అంటూ నయన్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోషూట్‌కు తిరుమల ఆలయం వేదికనుకుంటున్నారా? అని ఫైర్‌ అవుతున్నారు. వెంటనే చేసిన తప్పు తెలుసుకుని స్వామివారిని క్షమాపణ కోరండని సూచిస్తున్నారు.

చదవండి: కిన్నెరసాని సినిమా రివ్యూ
హీరోయిన్‌పై అసభ్య కామెంట్స్‌, పోలీసులకు ఫిర్యాదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement