నయనతారతో డేటింగ్.. నన్ను ఆ జంతువుతో పోల్చారు: విఘ్నేశ్ శివన్ | Vignesh Shivan compared to a dog when he went public with Nayanthara | Sakshi
Sakshi News home page

Vignesh Shivan: నయన్‌తో డేటింగ్.. డాగ్‌తో పోల్చారన్న విఘ్నేశ్ శివన్

Published Tue, Nov 19 2024 4:58 PM | Last Updated on Tue, Nov 19 2024 5:17 PM

Vignesh Shivan compared to a dog when he went public with Nayanthara

కోలీవుడ్ డైరెక్టర్‌ విఘ్నేశ్ శివన్ లేడీ సూపర్ స్టార్‌ నయనతారను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు ఆ తర్వాత వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు తల్లిదండ్రులయ్యారు. అయితే తాజాగా నయనతార తన జర్నీని డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్‌ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ డాక్యుమెంటరీలో నయన్ భర్త విఘ్నేశ్ శివన్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. నయనతారతో డేటింగ్‌ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఇందులో వివరించారు. తాను నయన్‌తో డేటింగ్‌లో ఉన్నప్పుడు పబ్లిక్ రియాక్షన్‌ ఎలా ఉందో తనకు తెలుసన్నారు. ఒక మృగాన్ని అందమైన అమ్మాయి ఎంచుకుంటే దానిని ఎవరూ ఆపలేరంటూ.. నన్ను కుక్కతో పోల్చారని విఘ్నేశ్ శివన్ వెల్లడించారు. కుక్కకు బిర్యానీ తినిపిస్తున్నారని చేసిన మీమ్‌లో మా ఇద్దరి చిత్రాలు ఉన్నాయని విఘ్నేశ్ తెలిపారు.

అయితే తాను నయనతారతో డేటింగ్ చేయడంలో తప్పు ఏంటని ట్రోలర్స్‌ను విఘ్నేశ్ ప్రశ్నించాడు. బస్ కండక్టర్ సూపర్ స్టార్ (రజినీకాంత్) అయ్యారు.. మన జీవితంలో ఒక గొప్ప స్థానానికి చేరుకోవడం అంత తేలిక కాదని అన్నారు. మేమిద్దరం లవ్‌లో ఉన్నప్పుడు చాలా ట్రోల్స్ వచ్చాయని తెలిపారు. వాటిని నేను తేలిగ్గా తీసుకున్నప్పటికీ.. నయనతార  గిల్టీగా ఫీలయిందని పేర్కొన్నారు. కొన్నిసార్లు నేను తన జీవితంలో భాగం కాకపోతే.. ఆమె మరింత సంతోషంగా ఉండేదన్న భావనతో కలిగిందని విఘ్నేశ్ శివన్ తెలిపాడు.

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్

నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో నయన్ తన ప్రేమ జీవితం, కెరీర్‌ ఆధారంగా తీసుకొచ్చారు. ఆమె తన అరంగేట్రం నుంచి సినీ ప్రయాణం చూపించారు. ఇందులో నాగార్జున, రానా దగ్గుబాటి, తాప్సీ పన్ను, రాధిక శరత్‌కుమార్, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్‌ కూడా నటించారు. కాగా.. ఈ డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత ధనుశ్- నయనతార మధ్య వివాదం మొదలైంది. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ ధాన్ మూవీ క్లిప్‌లను ఉపయోగించినందుకు నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపారు ధనుశ్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement