సింహాద్రిపురం, న్యూస్‌లైన్ : ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం వారు 111 ప్రదేశముల నుంచి సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ శాంతి కోసం భగవంతుడి సందేశాన్ని అందించేందుకు శాంతి దూత యువ సైకిల్ యాత్ర శుక్రవారం ఉదయం మండలంలోకి ప్రవేశించింది. బలపనూరు, అంకాలమ్మగూడూరు మీదుగా సింహాద్రిపురానికి చేరుకుంది.
ఈ సందర్భంగా బ్రహ్మకుమారి గీత, వరలక్ష్మిలు మాట్లాడుతూ ఉన్నత విలువలతో కూడిన జీవితాన్ని గడిపేందుకు కావాల్సిన ఆత్మస్థైర్య ధైర్యాలను యోగం ద్వారా పెంపొందించి ఆత్మహత్యలను నివారించవచ్చునన్నారు. ఒత్తిడి నుంచి విముక్తి కలిగించి ఆరోగ్యకరమైన సమాజాన్ని రాజయోగం ద్వారా నివారించవచ్చునన్నారు. ఈ యాత్ర కొండాపురం నుంచి జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, రాజంపేట, కోడూరు మీదుగా బెంగుళూరుకు చేరుకుంటుందన్నారు. అనంతరం బ్రహ్మకుమారిలు స్థానికులచే ప్రతిజ్ఞ చేయించారు. స్థానిక జేఏసీ నాయకులు, గ్రామస్తులు స్వాగతం పలికారు.