
సాక్షి, అమరావతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు ఆయన అభిమాని, మహారాష్ట్రకు చెందిన రైతు కాకా సాహెబ్ లక్ష్మణ్ కాక్డే. జగన్ ఈయనను ఆప్యాయంగా పలకరించి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
జగన్‌పై ఉన్న అభిమానంతో మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా నుంచి 800 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ తాడేపల్లికి వచ్చారు కాక్డే. ఈ నెల 17 న అక్కడి నుంచి బయలుదేరాడు. ఇవాళ సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
చదవండి: జగనన్న కాలంలో ఏపీ వైద్యారోగ్యానికి స్వర్ణయగం: మంత్రి రజిని