సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. మహారాష్ట్రలో కార్యక్రమాలు జరిగాయి. జగ్‌మోహన్‌రెడ్డి దాదాను(వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి) అభిమానుల ఎన్‌జీవో దాదాశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. ఖో-ఖో బహిరంగ పోటీ వీట్‌లో జరిగింది, ఇందులో మొత్తం 23 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ప్రైజ్ మనీతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు మొక్కలనూ బహుకరించింది దాదాశ్రీ ఫౌండేషన్.
ఇక ఈ పోటీలు 2 రోజుల పాటు కొనసాగాయి. సాల్సే స్కూల్‌లో చెట్లు నాటే కార్యక్రమంలో.. 501 మొక్కలు నాటారు. వీట్‌లో రక్తదాన శిబిరం నిర్వహించి 73 మంది రక్తదానం చేసి.. ప్రతి రక్తదాతకు హెల్మెట్‌లు అందజేశారు. కాకా కాకాడే జగ్‌మోహన్‌రెడ్డికి వీరాభిమాని, ఇప్పుడు షోలాపూర్ జిల్లాలోని ప్రతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment