సాక్షి, సోలాపూర్: మన రాష్ట్రం కాదు, మన భాష కాదు.. అయినా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అంటే వారికి ఎంతో ఇష్టం. సీఎం జగన్ ను ముద్దుగా దాదా అని పిలుచుకునే షోలాపూర్ వాసులు.. ఈ వర్షాకాలం పురస్కరించుకుని భారీ ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో మొక్కలు నాటారు.
వివరాల ప్రకారం.. సోలాపూర్ జిల్లాలోని నామదేవరావు జగతాప్ విద్యాలయాల్లో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. దాదాశ్రీ ఫౌండేషన్ ద్వారా సోమవారం ఉదయం పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో చెట్టును బహుమతిగా అందజేశారు. దీంతో.. విద్యార్థులు చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో డా.సంచిత్ పాల్ (రత్నానిధి ట్రస్ట్ సీఈవో), అమ్దార్ కుమారుడు యువ పారిశ్రామికవేత్త సుగంధ చంద్రికాపురే, యోగేష్ జంకర్ (ప్రముఖ కార్పొరేటర్ థానే), గౌతమ్‌జీ జగ్దాలే (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ షోలాపూర్), శివాజీ రావ్ బంద్‌గార్ సర్ (చైర్మన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్మలా (వి.వి. గోపానే) ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ మోహోల్) యూత్ నాయకులు సంతోష్ ధేరే, అశోక్ ధేరే, దాదాశ్రీ ఫౌండేషన్‌కు చెందిన మాధవ్ జాదవ్, దాదాశ్రీ ఫౌండేషన్ మెంటర్ దిగంబర్ (తాత్యా) చోప్డే యువ పారిశ్రామికవేత్త అశోక్ షేత్ చోప్డే, గణేష్‌జీ చవాన్ (జర్నలిస్ట్) జర్రే హైస్కూల్ ప్రిన్సిపల్ ఘడ్గే సర్ విద్యార్థి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మాకూ ఓ జగన్ కావాలి!
Comments
Please login to add a commentAdd a comment