Oxygen Park
-
హైదరాబాద్ : ఎల్ బి నగర్ ఆక్సిజన్ పార్క్ (ఫొటోలు)
-
సీఎం జగన్ స్పూర్తిగా.. మరో కార్యక్రమం
సాక్షి, సోలాపూర్: మన రాష్ట్రం కాదు, మన భాష కాదు.. అయినా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అంటే వారికి ఎంతో ఇష్టం. సీఎం జగన్ ను ముద్దుగా దాదా అని పిలుచుకునే షోలాపూర్ వాసులు.. ఈ వర్షాకాలం పురస్కరించుకుని భారీ ఎత్తున చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో మొక్కలు నాటారు. వివరాల ప్రకారం.. సోలాపూర్ జిల్లాలోని నామదేవరావు జగతాప్ విద్యాలయాల్లో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. దాదాశ్రీ ఫౌండేషన్ ద్వారా సోమవారం ఉదయం పాఠశాలలోని విద్యార్థులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో చెట్టును బహుమతిగా అందజేశారు. దీంతో.. విద్యార్థులు చెట్లను నాటారు. ఈ కార్యక్రమంలో డా.సంచిత్ పాల్ (రత్నానిధి ట్రస్ట్ సీఈవో), అమ్దార్ కుమారుడు యువ పారిశ్రామికవేత్త సుగంధ చంద్రికాపురే, యోగేష్ జంకర్ (ప్రముఖ కార్పొరేటర్ థానే), గౌతమ్‌జీ జగ్దాలే (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ షోలాపూర్), శివాజీ రావ్ బంద్‌గార్ సర్ (చైర్మన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ చైర్మన్ కర్మలా (వి.వి. గోపానే) ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ మోహోల్) యూత్ నాయకులు సంతోష్ ధేరే, అశోక్ ధేరే, దాదాశ్రీ ఫౌండేషన్‌కు చెందిన మాధవ్ జాదవ్, దాదాశ్రీ ఫౌండేషన్ మెంటర్ దిగంబర్ (తాత్యా) చోప్డే యువ పారిశ్రామికవేత్త అశోక్ షేత్ చోప్డే, గణేష్జీ చవాన్ (జర్నలిస్ట్) జర్రే హైస్కూల్ ప్రిన్సిపల్ ఘడ్గే సర్ విద్యార్థి పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మాకూ ఓ జగన్ కావాలి! -
ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా అర్బన్ పార్కులు
సాక్షి,హైదరాబాద్/మేడ్చల్: రాష్ట్రంలో ప్రభుత్వపరంగా అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు రాబోయే రోజుల్లో ఆక్సిజన్ ఫ్యాక్టరీలుగా పనిచేస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును సీఎస్ సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోడల్ పార్కు (మియావాకి ప్లాంటేషన్)లో రాష్ట్రమంతటా కనీసం ఒక ఎకరంలో భారీగా మొక్కలు నాటి చిట్టడవులుగా మారుస్తామని చెప్పారు. నిధుల కొరతను అధిగమించి శాచురేషన్ పద్ధతిలో అటవీ పునరుజ్జీవ చర్యలు చేపడతామని,ఫెన్సింగ్ నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కొద్దిసేపు పాల్గొన్న మంత్రి సీహెచ్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ఈ ఆక్సిజన్‌పార్కు ఆహ్లా దకరంగా ఉందన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుజ్జీవనం, తేమ పరిరక్షణ తదితర వివరాలను సీఎస్‌కు అధికారులు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు 5 కి.మీ పరిధిలో 59 అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ నెల 16 న సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి, ఉద్యానవనాల అభివృద్ధిపై చర్చిస్తారని వెల్లడించారు. వీటిలో 32 ఇప్పటికే పూర్తయ్యాయని సీఎస్‌కు పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 95 అటవీ పార్కులు ఏర్పాటు చేయాలనే ప్రణాళికలున్నాయని చెప్పారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రశాంతి, మేడ్చల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అదనపు పీసీసీఎఫ్‌లు డీఎఫ్‌వోలు పాల్గొన్నారు. -
విదేశాలతో పోటీపడి మొక్కలు నాటుతున్నాం
మేడ్చల్ : చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో సమానంగా, మనదేశంలో ఎక్కడా లేని విధం గా తెలంగాణలో సీఎం కేసీఆర్ హరితçహారం కార్య క్రమాన్ని చేపట్టారని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్స వాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మండలం కండ్లకోయ ఔటర్‌రింగు రోడ్డు జంక్షన్ వద్ద 70 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్క్‌ను మంత్రి బుధవారం ప్రారంభించారు. పార్క్‌లో ఏవియర్(పక్షుల సందర్శన కేంద్రం)కు శంకుస్ధాపన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పచ్చదనం లేకుండా పోయిందని, అటవీ సంపద నాశనమైందని మంత్రి అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 4 నెలల్లోనే హరితహారం చేపట్టి రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం పెరుగు తుందని అన్నారు. హైదరాబాద్ చుట్టూ 134 ప్రాంతాల్లో 180 అటవీ సైట్లు ఉన్నాయని, వాటిని గతంలో ఏ పాలకుడూ పట్టించుకో లేదని, నగర ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం రూ.70 కోట్లు ఖర్చు చేసి 12 పార్క్‌లను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. దశల వారీ గా 186 ఫారెస్ట్ బ్లాక్‌ల్లో అర్బన్ పార్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించారని, త్వరలో కీసర, శామీర్ పేటల్లో కూడా పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశంలో ప్రతిమనిషికి సగటున 107 చెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పార్క్‌లో క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. -
భాగ్యనగరంలో ఆక్సిజన్ పార్కులు