
పార్క్‌లో సందడి చేస్తున్న మంత్రి జోగురామన్న
మేడ్చల్ : చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో సమానంగా, మనదేశంలో ఎక్కడా లేని విధం గా తెలంగాణలో సీఎం కేసీఆర్ హరితçహారం కార్య క్రమాన్ని చేపట్టారని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్స వాన్ని పురస్కరించుకుని మేడ్చల్ మండలం కండ్లకోయ ఔటర్‌రింగు రోడ్డు జంక్షన్ వద్ద 70 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ పార్క్‌ను మంత్రి బుధవారం ప్రారంభించారు. పార్క్‌లో ఏవియర్(పక్షుల సందర్శన కేంద్రం)కు శంకుస్ధాపన చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పచ్చదనం లేకుండా పోయిందని, అటవీ సంపద నాశనమైందని మంత్రి అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 4 నెలల్లోనే హరితహారం చేపట్టి రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని తెలిపారు. దీని వల్ల రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం పెరుగు తుందని అన్నారు. హైదరాబాద్ చుట్టూ 134 ప్రాంతాల్లో 180 అటవీ సైట్లు ఉన్నాయని, వాటిని గతంలో ఏ పాలకుడూ పట్టించుకో లేదని, నగర ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం రూ.70 కోట్లు ఖర్చు చేసి 12 పార్క్‌లను అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. దశల వారీ గా 186 ఫారెస్ట్ బ్లాక్‌ల్లో అర్బన్ పార్కుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆదేశించారని, త్వరలో కీసర, శామీర్ పేటల్లో కూడా పార్కులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశంలో ప్రతిమనిషికి సగటున 107 చెట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. పార్క్‌లో క్యాంటీన్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కోరడంతో మంత్రి సానుకూలంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment