
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న ఎంఎంటీఎస్(MMTS) రైలులో ఓ దుండగుడు.. యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో, భయాందోళనకు గురైన సదరు యువతి.. రైలులో నుంచి బయటకు దూకేసింది.
వివరాల ప్రకారం.. ఎంఎంటీఎస్(MMTS)లో ఓ దుండగుడు రెచ్చిపోయాడు. ఎంఎంటీఎస్ ప్రయాణంలో ఉండగా.. ఓ యువతిపై దుండగుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు బోగీలో యువతి ఒక్కరే ఉన్నారు. ఈ క్రమంలో బోగీలోకి ఎక్కిన దుండగుడు.. కొంపల్లి వద్ద ఆమెపై లైంగికదాడికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలులో నుంచి కిందకు దూకేసింది.
దీంతో, బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment