fans association
-
మహారాష్ట్రలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు
సాక్షి, ముంబై: ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా.. మహారాష్ట్రలో కార్యక్రమాలు జరిగాయి. జగ్మోహన్రెడ్డి దాదాను(వైఎస్ జగన్మోహన్రెడ్డి) అభిమానుల ఎన్జీవో దాదాశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. ఖో-ఖో బహిరంగ పోటీ వీట్లో జరిగింది, ఇందులో మొత్తం 23 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ప్రైజ్ మనీతో పాటు పాల్గొన్న క్రీడాకారులకు మొక్కలనూ బహుకరించింది దాదాశ్రీ ఫౌండేషన్. ఇక ఈ పోటీలు 2 రోజుల పాటు కొనసాగాయి. సాల్సే స్కూల్లో చెట్లు నాటే కార్యక్రమంలో.. 501 మొక్కలు నాటారు. వీట్లో రక్తదాన శిబిరం నిర్వహించి 73 మంది రక్తదానం చేసి.. ప్రతి రక్తదాతకు హెల్మెట్లు అందజేశారు. కాకా కాకాడే జగ్‌మోహన్‌రెడ్డికి వీరాభిమాని, ఇప్పుడు షోలాపూర్ జిల్లాలోని ప్రతి పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. -
'వారికి రజనీకాంత్‌కు సంబంధం లేదు'
సాక్షి, చెన్నై : రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ప్రకటనతో తమిళనాడులో రాజకీయం రసకందాయంగా ఉంది. ఈమేరకు రజనీ పార్టీ తరపున చాలామంది నేతలు పలు టీవీ ఛానెల్‌లలో కూర్చొని గంటలకొద్ది డిబేట్లు నిర్వహిస్తున్నారు. అయితే వాటిపై రజనీకాంత్ అభిమానుల అసోషియేషన్ ఓ కీలక ప్రకటన చేసింది. పార్టీ తరపున ఏ ఒక్కరిని అధికార ప్రతినిధిగా గుర్తించలేదని పేర్కొంది. రజనీ కొత్తపార్టీని స్వయంగా ప్రకటించిన తర్వాతనే అన్ని విషయాలు వెల్లడిస్తామని అభిమానుల అసోసియేషన్ అధ్యక్షుడు, వీఎం సుధాకర్ తెలిపారు. ఇప్పటి వరకూ టీవీ డిబేట్లు, పత్రికా సమావేశాల్లో రజనీ పార్టీ గురించి మాట్లాడినవి, వారి స్వంత అభిప్రాయాలుగా గుర్తించాలన్నారు. వారి వక్తిగత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలకు ముడిపెట్టొద్దని సుధాకర్ సూచించారు. పార్టీ తరపున కానీ, అభిమాన సంఘాల తరపున ఏఒక్కరినీ పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తించలేదని ఆయన అన్నారు. రజనీకాంత్‌కు టీవీ డిబేట్లు, పత్రికా సమావేశాల్లో మాట్లాడేవారికి ఎటువంటి సంబంధం లేదన్నారు. గత డిసెంబర్ 31 రజనీ కొత్తపార్టీని పెడతానని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 నియోకవర్గాల్లో పోటీచేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. -
‘రజనీ పేరవై’తో ప్రజల్లోకి..!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ‘రజనీ పేరవై’ (రజనీ సమాఖ్య) పేరుతో ప్రజల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన ఈ నెల 31న పార్టీ ప్రకటించబోరని తెలుస్తోంది. అయితే ‘రజనీ పేరవై’ పేరిట ఒక వేదికను ప్రకటిస్తారని సమాచారం. 20– 30 ఏళ్ల మధ్యనున్న యువకులను పేరవైలో సభ్యులుగా చేర్చుకోవాలని అభిమాన సంఘాలకు ఇప్పటికే రజనీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. నియోజవర్గాల వారీగా జనాభా, ఓటర్ల సంఖ్య, స్థానిక సమస్యల గురించి సమాచారం సేకరించే బాధ్యతలను పేరవై ప్రతినిధులకు అప్పగించే అవకాశాలున్నాయి. అలాగే తాను పార్టీ స్థాపిస్తే సినీ పరిశ్రమ నుంచి ఎవరెవరు వస్తారని రహస్య సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అభిమానులతో రజనీ భేటీ చెన్నైలో గురువారమూ కొనసాగింది. -
హీరో అభిమాన సంఘం నిర్వాహకుడి అరెస్ట్
తమిళసినిమా : రాజకీయ నాయకులు శాశ్వతం కాదని, దేశం మాత్రమే శాశ్వతమని విలక్షణ నటుడు కమలహాసన్ వ్యాఖ్యానించారు. ఇటీవల తమిళ రాజకీయాలపై కమల్ తనదైన బాణిలో స్పందిస్తున్న విషయం తెలిసిందే. శాసన సభ్యులు మీ గ్రామాలకు వస్తున్నారు. వారికి తగిన మర్యాద ఇవ్వండి అంటూ ప్రజలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు వ్యంగ్యంగా ఉన్నాయంటూ కమల్‌పై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కాగా పుదుకొట్టయ్ లో కమలహాసన్ అభిమాన సంఘం నిర్వాహకుడు సుధాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్లికట్లు పోరాటంలో సుధాకర్ రాష్ట్రమంత్రిని అవమానపరచే విధంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై కేసు నమోదు చేశారు. ఆ చర్యలను తీవ్రంగా ఖండించిన కమల్ తన ట్విట్టర్లో పేర్కొంటూ.. ‘ఇక ప్రజల నీతిని దేశం కాపాడుకుంటుంది. నేను విమర్శించకుండా, శాంతియుతంగానే నడుచుకోవాలని భావించాను. కానీ నా అభిమాన సంఘం కార్యకర్తల అరెస్ట్ మాట్లాడించేలా చేసింది. జల్లికట్టు అంశంలో నా సంఘ కార్యకర్తతో పాటు మరి కొందరిని అరెస్ట్ చేశారు. అది నా సహనాన్ని, రాజకీయ హింసాత్మక ధోరణిని చూపుతోంది. నా సంఘానికి చెందిన వారు కాస్త నిబద్ధత పాటించాల్సిన సమయం ఇది. రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. పార్టీకి చెందిన వారు మోసాలకు పాల్పడినా అందుకు అతీతంగా సేవ చేసే మనం ఎలాంటి కూలి ఆశించకుండా జీవం ఉన్నంత వరకూ ప్రజలకు సేవ చేద్దాం. రాజకీయ నాయకులు శాశ్వతం కాదు. మన దేశం శాశ్వత’మని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
రాజకీయాల్లోకి ‘రజనీ’ అభిమాన సంఘం
సాక్షి, చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘం తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. రజనీకాంత్ పుట్టినరోజైన 12వ తేదీన పార్టీ పేరు, జెండా, గుర్తులను ప్రకటించనున్నట్లు తిరుపూరుకు చెందిన తమిళనాడు రజనీకాంత్ ప్రజా కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎస్ఎస్ మురుగేష్ మంగళవారం ప్రకటించారు. పార్టీ స్థాపనపై కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సైతం చేసుకున్నట్లు మురుగేష్ వెల్లడించారు. కాగా, నిబంధనలకు విరుద్ధంగా మురుగేష్ వ్యవహరిస్తున్నారని, రజనీ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని అభిమాన సంఘాల నేత ఒకరు వ్యాఖ్యానించారు. -
అజిత్ ఔదార్యం
నటుడు అజిత్ గుప్తదానాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తన పేరిట ఏర్పాటయిన అభిమాన సంఘం ద్వారా పేదలకు తన వంతు సాయం అందజేస్తున్నారు. మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాల ఏర్పాటు, సంక్షేమ సహాయకాల పంపిణీ వంటివి చేపట్టారు. అభిమాన సంఘాన్ని తొలగించి తానే స్వయంగా సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. షూటింగ్‌లోనూ సహ కళాకారులకు వైద్య సాయం చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసి అందరికీ వడ్డిస్తున్నారు. ప్రస్తుతం తన వద్ద పని చేసే 12 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇది వరకే వీరికి ఇళ్లు నిర్మించేందుకు చెన్నై సమీపంలోని కేళంబాక్కంలో స్థలాన్ని కొనుగోలు చేశారు. దాన్ని 12 మందికి విభజించి ఇచ్చారు. ఇళ్లు నిర్మించేందుకు పెద్ద మొత్తం అవసరం కావడంతో వారు నిర్మించుకోలేకపోయారు. ప్రస్తుతం అజిత్ తన సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించి వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. అజిత్ సేవలను సహ నటులు అభినందిస్తున్నారు. -
టీడీపీలో బాలయ్యకు ప్రాధాన్యమేదీ?
తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి వారసులకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఇవ్వని పక్షంలో తెలుగుదేశం పార్టీకి తామంతా వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బాలకృష్ణ. ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు.