సోనూ సూద్ సాయం.. వైఎస్సార్‌సీపీ నేతల కృతజ్ఞతలు | YSRCP Thanks To Sonu Sood For Helping Vijayawada Flood Victims | Sakshi
Sakshi News home page

వరద బాధితులకు సోనూ సూద్ సాయం.. వైఎస్సార్‌సీపీ నేతల కృతజ్ఞతలు

Published Fri, Sep 6 2024 5:39 PM | Last Updated on Fri, Sep 6 2024 5:45 PM

YSRCP Thanks To Sonu Sood For Helping Vijayawada Flood Victims

ఎన్టీఆర్‌, సాక్షి: విజయవాడ వరద బాధితులకు సినీ నటుడు సోనూ సూద్ అండగా నిలిచారు. తన ట్రస్ట్‌ తరఫు నుంచి బాధితుల కోసం కనీస అవసరాల కిట్లను  పంపించారాయన. వైఎస్సార్‌సీపీ నేత వంగవీటి నరేంద్ర ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరగ్గా.. ఆపై సోనూసూద్‌తో వీడియో కాల్‌ మాట్లాడి కృతజ్ఞతలు తెలిపారాయన.  

తెలుగు రాష్ట్రాల వరద పరిస్థితులపై సోనూసూద్‌ చలించిపోయి సాయానికి ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయవాది సుంకర నరేష్‌, వరద బాధితుల కష్టాలను సోనూసూద్‌కు తెలియజేశారు. దీంతో.. బకెట్లు, చాపలు, దుప్పట్లతో కూడిన తినుబండారాలతో 2000 కిట్లను ఆయన పంపించారు. 

ఆ కిట్లను పాయకాపురంలో వరద బాధితులకు పంపిణీ చేసింది రాధా-రంగా మిత్ర మండలి. ఈ సంఘం అధ్యక్షుడు.. వైఎస్సార్‌సీపీ నేత వంగవీటి నరేంద్ర ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సోనూ సూద్‌కు వీడియో కాల్‌ చేసి సురేష్‌, నరేంద్రలు కృతజ్ఞతలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement