ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ('దాదా' అని ప్రేమగా పిలుస్తారు) పుట్టినరోజు సందర్భంగా మహారాష్ట్రలోని ఆయన అభిమానుల సంఘం ఎన్జీవో ‘దాదాశ్రీ ఫౌండేషన్ తమ ఉదారతను చాటుకుంది. ఏపీ ప్రజల సంక్షేమం పట్ల సీఎం నిబద్దత, నాయకత్వాన్ని మెచ్చుకుంటూ కాక కాకడే, ధోకేశ్వర్లోని మాతోశ్రీ గ్లోబల్ స్కూల్ & జూనియర్ కాలేజీకి 54 సీట్ల పాఠశాల బస్సును విరాళంగా అందజేసింది.
విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు రూ. 33 లక్షల విలువైన ఏసీ బస్సును విరాళంగా అందించి ఓదార్యం చాటుకుంది. బస్సు అందించడంపై పాఠశాల యాజమాన్యం స్పందించింది. ఫౌండేషన్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ బస్సు గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు పాఠశాలకు చేరవేసేందుకు గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపింది. పాఠశాల విద్యార్ధులు సైతం సీఎం జగన్ ఫోటోతో కృతజ్ఞత తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment