
కోలీవుడ్‌లో ‘జిగర్తాండ’ మూవీ సెన్సేషనల్ హిట్‌గా నిలిచే సరికి.. ఇక్కడ రీమేక్‌చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. బాలీవుడ్ దబాంగ్ మూవీని ఇక్కడి జనాలు మెచ్చే విధంగా రీమేక్(గబ్బర్ సింగ్) చేసి రికార్డులు సృష్టించిన హరీష్ శంకర్ ఈ మూవీని రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
‘ఎఫ్2’తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన వరుణ్ తేజ్ ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తమిళ్ వర్షెన్‌లో ప్రతినాయకుడిగా బాబీ సింహా మెప్పించగా.. అదే పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
Here is the title poster of my next!!!#Valmiki with @harish2you pic.twitter.com/7EyZbbgwBF
— Varun Tej Konidela (@IAmVarunTej) January 27, 2019