విగ్రహావిష్కరణలో ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి
రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ వాల్మీకి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాజంపేట ఎమ్మెల్యే మేడామల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డిలు ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ మాట్లాడుతూ వాల్మికుల సమస్యలపై లోక్‌సభలో ప్రస్తావించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానన్నారు.
వాల్మికుల సమస్యలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వాల్మికులను ఎస్టీలుగా గుర్తించాలని దశాబ్దాలుగా కోరుతున్నారన్నారు. ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు రుషులవుతారని చెప్పిన వాల్మికి అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. జెడ్పీ చైర్మన్ ఆకేపాటి మాట్లాడుతూ రామాయణం ద్వారా ఈ ప్రపంచానికి సీతారామ,లక్ష్మణ, ఆంజనేయులను పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి, రామాయణం సృష్టికర్త వాల్మీకి మహర్షి అని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment