సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?. "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?.’’ అంటూ కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు.
‘‘లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నగదు విత్‌డ్రా చేయబడిన బార్‌లు, బంగారు దుకాణాలు ఎవరివి? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి?. హైదరాబాద్‌కు ఇన్ని లింకులు కనపడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ ఈ స్కాం గురించి నోరు విప్పాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
✳️ కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్!
✳️ హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?
✳️ "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?
✳️… pic.twitter.com/0X1DiQIh4b— KTR (@KTRBRS) August 25, 2024
Comments
Please login to add a commentAdd a comment