
ఒక చోట సక్సెస్ అయిన చిత్రాన్ని కొన్ని మార్పులు చేసి మరోచోట హిట్ కొట్టడం ఈజీనే అయినా.. ప్రతిసారీ ఆ ఫార్మూలా వర్కౌట్ కాదు. బాలీవుడ్ ‘దబాంగ్’ను ఇక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి(గబ్బర్‌సింగ్) బ్లాక్ బస్టర్‌హిట్ కొట్టాడు హరీష్ శంకర్. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ మరో రీమేక్‌పై కన్నేశాడు. కోలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తీయబోతున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్‌లో బాబీసింహా చేసిన పాత్రను వరుణ్ తేజ్ పోషిస్తుండగా.. సిద్దార్థ్ పాత్రకు శ్రీవిష్ణును తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా డబ్‌స్మాష్ స్టార్ మృణాలినీ రవిని తీసుకున్నట్లు రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ చిత్రంలో ఈషా రెబ్బాను తీసుకున్నారని వినిపిస్తోంది. మరి ఏది నిజమో తెలియాలంటే.. చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించేవరకు వేచిచూడాల్సిందే. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment