
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం ఒక ఎత్తైతే.. ఆ స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం ఒక సవాల్. అలా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫిదా, తొలిప్రేమతో కూల్ హిట్స్ కొట్టిన వరుణ్.. తాజాగా ‘అంతరిక్షం’, ‘ఎఫ్2’లతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.
సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో ‘ఘాజీ’ తెరకెక్కించిన సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్ నటించిన ‘అంతరిక్షం’ డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడిగా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం రిలీజ్ అయిన తరువాత తక్కువ గ్యాప్‌లోనే ‘ఎఫ్2’ చిత్రం కూడా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఒకటి సైన్స్ ఫిక్షన్ కాగా, రెండోది మాస్ ఎంటర్‌టైనర్ కాబట్టి రెండింటికి విజయావకాశాలు ఎక్కువే. సో.. ఈ మెగా హీరో బ్యాక్‌టుబ్యాక్ హిట్స్ కొట్టబోతున్నాడని అభిమానులు సంబరపడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment