![Ramcharan Attend For Anthariksham Movie Pre Release Event - Sakshi](/styles/webp/s3/article_images/2018/12/17/Ram.jpg.webp?itok=cVDLhUf1)
స్టార్ హీరోలు తోటి హీరోల ఈవెంట్లలో పాల్గొనడం ఇటీవల ఓ ట్రెండ్‌గా మారింది. పరిశ్రమలో హీరోల మధ్య, వారి అభిమానుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉందనడానికి ఆడియో ఆవిష్కరణ వేడుకలు, ప్రీ రిలీజ్, సినిమా సక్సెస్‌మీట్లు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా తమ్ముడు వరుణ్ తేజ్ సినిమా ఫంక్షన్‌కు అన్న రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం అంతరిక్షం 9000 kmph. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ అందుకుంది. డిసెంబర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షం 9000 kmph సినిమాను తెరకెక్కించారు సంకల్ప్ రెడ్డి. తాజాగా విడుదలైన ఆడియో.. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment