అంచనాలను పెంచేస్తున్న అంతరిక్షం టీజర్‌ | Antariksham 9000 KMPH Teaser | Sakshi
Sakshi News home page

అంచనాలను పెంచేస్తున్న అంతరిక్షం టీజర్‌

Oct 17 2018 4:36 PM | Updated on Oct 17 2018 8:24 PM

Antariksham 9000 KMPH Teaser  - Sakshi

మెగా వారసుడు వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన ‘అంతరిక్షం 9000 కెఎమ్‌పిహెచ్’ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌, ఈ ట్రైలర్‌తో మరింత ఆకర్షిస్తున్నారు. హై టెక్నికల్‌ వాల్యూస్‌, హాలీవుడ్‌ నిపుణుల సారధ్యంలో యాక్షన్‌ సీన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరుణ్‌  కరియర్‌లో మరో కీలక చిత్రంగా మారనుంది.
 

వరుణ్ తేజ్, అదితిరావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసుకుంది. మొదటి సినిమా ‘ఘాజి’(ఫస్ట్‌ సబ్‌మెరైన్‌ ఫిలిం) తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందించగా, డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి‌.. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంది. తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర నిర్మాతలు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement